Unmukt Chand Marriage: తన కెప్టెన్సీలో భారత్‌కు అండర్-19 ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఉన్ముక్త్ చంద్, ఫిట్‌నెస్, న్యూట్రిషన్ కోచ్ సిమ్రాన్ ఖోస్లా చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న ఉన్ముక్త్ ఆదివారం సిమ్రాన్‌ణు వివాహామాడాడు. కొద్దిమంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో వివాహ వేడుకలు నిర్వహించారు.
సిమ్రాన్ ఖోస్లా ఎవరంటే..!
ఉన్ముక్త్ చంద్ వివాహామాడిన సిమ్రాన్ ఖోస్లా ఫిట్‌నెస్, న్యూట్రిషన్ కోచ్‌గా పనిచేస్తుంది. వీరి వివాహాం సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ‘మేం ఎప్పటికీ ఒకటిగా కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం’ అంటూ క్యాప్షన్ అందించారు.
ఈ ఏడాదే క్రికెట్ నుంచి రిటైర్మెంట్..
తన కెప్టెన్సీలో భారత్‌కు అండర్-19 ప్రపంచకప్‌ను అందించిన ఉన్ముక్త్ చంద్ మంచి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. భారత క్రికెట్ జట్టుకు భవిష్యత్ ఆటగాడిగా పేరుగాంచాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టుకు ఆడే అవకాశం కూడా పొందాడు. అయితే ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి పరుగులు రాకపోవడంతో ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాడు. క్రమంగా అతడిని ఢిల్లీ రంజీ జట్టు నుంచి కూడా తప్పించారు. దీని తర్వాత ఉత్తరాఖండ్ జట్టు నుంచి రంజీ ఆడాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ కొన్ని రోజులు ఆడిన తరువాత, ఈ ఏడాది హఠాత్తుగా క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
బిగ్ బాష్ లీగ్ ఆడిన తొలి భారతీయుడు..
ఉన్ముక్త్ చంద్ క్రికెట్ నుంచి రిటైరయ్యాక ఇండియా వదిలి అమెరికాలో క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. అతను ప్రస్తుతం సిలికాన్ వ్యాలీ స్ట్రైకర్స్ జట్టుతో కలిసి అమెరికన్ క్రికెట్ లీగ్‌లో ఆడుతున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. మెల్బోర్న్ రెనెగేడ్స్ తరపున ఆడేందకు సైన్ కూడా చేశాడు. దీంతో బిగ్ బాష్ లీగ్‌లో ఆడనున్న తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు.
Rohit Sharma: హోప్స్ పెంచిన లోయర్ ఆర్డర్.. దక్షిణాఫ్రికాతోనే అసలైన పరీక్ష: రోహిత్ శర్మ