Womens World Cup 2025: మహిళల ప్రపంచకప్‌కు అతిధ్యం ఇవ్వనున్న భారత్.. వివరాలివే!

|

Jul 27, 2022 | 11:00 AM

వచ్చే రెండేళ్లలో రెండు ప్రపంచకప్‌ల ఆతిధ్యం ఇవ్వనుంది భారత్. 2023లో పురుషుల వన్డే వరల్డ్ కప్‌కు..

Womens World Cup 2025: మహిళల ప్రపంచకప్‌కు అతిధ్యం ఇవ్వనున్న భారత్.. వివరాలివే!
Icc Cricket Worldcup
Follow us on

వచ్చే రెండేళ్లలో రెండు ప్రపంచకప్‌ల ఆతిధ్యం ఇవ్వనుంది భారత్. 2023లో పురుషుల వన్డే వరల్డ్ కప్‌కు.. ఆ తర్వాత 2025లో మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత్ వేదిక కానుంది. ఇటీవల ఇండియన్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ).. ఐదేళ్లలో జరగబోయే మహిళల మెగా ఈవెంట్లపై కీలక ప్రకటన చేసింది. 2023-2027 అమ్మాయిల మెగా ఈవెంట్ల షెడ్యూల్‌ను ఖరారు చేసింది.

2024లో బంగ్లాదేశ్ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. ఆ తర్వాత 2025లో వన్డే వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిధ్యం ఇవ్వనుంది. నెక్స్ట్ 2026లో మరో టీ20 ప్రపంచకప్ ఇంగ్లాండ్‌లో జరగనుండగా.. తొలిసారిగా మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ శ్రీలంక వేదికగా 2027లో ఐసీసీ నిర్వహించనుంది. అయితే ఇక్కడొక మెలిక ఉంది బాసూ..! టీ20 ఫార్మాట్‌గా జరగబోయే ఈ టోర్నీకి శ్రీలంక మహిళల జట్టు క్వాలిఫై అయితేనే.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ దేశం వేదిక కానుంది.

కొత్త ఐసీసీ చైర్మన్ ఎంపిక అప్పుడే..

ఐసీసీకి కొత్త బాస్ రానున్నాడు. నవంబర్ 2022లో ఐసీసీ కొత్త చైర్మన్ ఎంపిక జరగనుందని బోర్డు ఇటీవల జరిగిన సమావేశంలో లీకల నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నిక ప్రక్రియ మెజారిటీ ఓటింగ్ శాతంలో జరగనుందని స్పష్టం చేసింది.

ఐసీసీ క్రికెట్ కమిటిలో లక్ష్మణ్‌కు చోటు..

ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీలో భారత మాజీ ఆటగాడు వి.వి.ఎస్. లక్ష్మణ్‌కు చోటు దక్కింది. అతడితో పాటు కివీస్ మాజీ కెప్టెన్ డానియల్ విటోరీ, రోజర్ హార్పర్‌లు కూడా కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..