
IND vs WI 2nd Test: ఢిల్లీ టెస్ట్ లో నాలుగో రోజు భారత్ కు 121 పరుగుల విజయ లక్ష్యాన్ని వెస్టిండీస్ నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆ జట్టు 390 పరుగులకే ఆలౌట్ అయింది. జస్టిన్ గ్రీవ్స్ (50), జేడెన్ సీల్స్ (32) 10వ వికెట్ కు 113 బంతుల్లో 79 పరుగులు జోడించారు.
ఒకానొక సమయంలో వెస్టిండీస్ ఇన్నింగ్స్ ఓటమి ముప్పును ఎదుర్కొంది. అయితే, జాన్ కాంప్‌బెల్ (115), షాయ్ హోప్ (103) సెంచరీలు సాధించి ఓటమిని నివారించారు. మూడో వికెట్‌కు వీరిద్దరు 177 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరు ఔటైన తర్వాత, మిగిలిన బ్యాట్స్‌మెన్స్ పెద్దగా పోరాడలేకపోయారు.
భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీసుకున్నారు.
అంతకుముందు, మ్యాచ్ మూడో రోజు, వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 518/5 వద్ద డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ ఫాలో ఆన్ చేయాల్సి వచ్చింది.
భారత్: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
వెస్టిండీస్: టెగ్‌నారాయణ్ చంద్రపాల్, జాన్ కాంప్‌బెల్, అలిక్ అథనాసే, రోస్టన్ చేజ్ (కెప్టెన్), షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్ (వికెట్ కీపర్), జస్టిన్ గ్రీవ్స్, ఖారీ పీర్స్, జోమెల్ వారికన్, ఆండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్.