మరికొద్ది సేపట్లో ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య మూడో వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం కావడంతో మూడో మ్యాచ్ కీలకంగా మారింది. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మ్యాచ్ కావడంతో హోరాహోరీగా జరిగే అవకాశముంది. కాగా గత రెండు వన్డేల్లో టీమ్ ఇండియా తుది జట్టులో చాలా మార్పులు చేసింది. మరి ఈ మ్యాచ్‌లోనూ ప్రయోగాలు చేస్తుందా?లేదా? అన్నది ఆసక్తికరం. ఎందుకంటే భారత్‌కు ఈ సిరీస్ విజయం చాలా ముఖ్యం. 2006 నుంచి భారత్ వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోలేదు. దీంతో మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. గత రెండు వన్డేల్లో ఆడని విరాట్ కోహ్లి నేటి మ్యాచ్‌లో ఆడతాడో లేదో చూడాలి. కాగా కోహ్లీ ఆడకపోవడంపై పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విరాట్ మూడో వన్డే ఆడడని, అప్పుడే స్వదేశానికి తిరిగి వచ్చాడని ప్రచారం జరుగుతోంది. మరోవైపు విరాట్ మూడవ వన్డేలో ఆడతాడని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఆడతాడని, సంజూ శాంసన్‌కి కూడా అవకాశం దక్కుతుందని తెలుస్తుంది. డూ ఆర్ డై మ్యాచ్ కావడంతో రోహిత్-గిల్ ఓపెనర్లుగా దిగుతారని తెలుస్తోంది.
ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఉంటారని తెలుస్తోంది. భారత బౌలింగ్ విభాగంలో కూడా మార్పులు జరగవచ్చని తెలుస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లో రిజర్వ్ బెంచ్‌కు పరిమితమైన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ నేడు బరిలోకి దిగే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్‌కు విశ్రాంతి లభించవచ్చు. శార్దూల్ ఠాకూర్, ముఖేష్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ తుది జట్టులో ఉండవచ్చు. ఎంపికలో జయదేవ్ ఉనద్కత్ కూడా ఉన్నాడు.
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శామ్సన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, ఉమ్రాన్ మాలిక్.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..