IND vs SL, 2nd Test, Day 2 Highlights: ముగిసిన రెండో రోజు ఆట.. శ్రీలంక ముందు భారీ టార్గెట్

|

Mar 13, 2022 | 9:40 PM

IND vs SL, 2nd Test, Day 2 Highlights: శ్రీలంక ముందు టీమిండియా 447 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (67) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

IND vs SL, 2nd Test, Day 2 Highlights: ముగిసిన రెండో రోజు ఆట.. శ్రీలంక ముందు భారీ టార్గెట్
Ind Vs Sl 2nd Test

బెంగళూరు వేదికగా జరుగుతున్న డే-నైట్ టెస్టు మ్యాచ్‌లో భారత్ శ్రీలంక ముందు 447 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 1 వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే 10, కుసాల్ మెండిస్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.

బెంగుళూరు టెస్టులో ఇంకా 3 రోజులు మిగిలి ఉండగా, టీమిండియా విజయానికి 9 వికెట్లు కావాలి. అదే సమయంలో శ్రీలంక లక్ష్యానికి ఇంకా 419 పరుగులు వెనుకంజలో ఉంది. రెండో రోజు ఆటలో ఇరు జట్లు కలిసి 14 వికెట్లు తీశాయి. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 303 పరుగలు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (67) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే సమయంలో రిషబ్ పంత్ 50 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక తరపున ప్రవీణ్ జయవిక్రమ 4 వికెట్లు, లసిత్ ఎంబుల్దేనియా 3 వికెట్లు తీశారు.

అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌటైంది. ఏంజెలో మాథ్యూస్ (43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో ఆర్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమీ చెరో 2 వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ ఖాతాలో ఓ వికెట్ చేరింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 252 పరుగులకు ఆలౌటైంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Mar 2022 09:40 PM (IST)

    ముగిసిన రెండో రోజు ఆట

    బెంగళూరు వేదికగా జరుగుతున్న డే-నైట్ టెస్టు మ్యాచ్‌లో భారత్ శ్రీలంక ముందు 447 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 1 వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే 10, కుసాల్ మెండిస్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 13 Mar 2022 08:49 PM (IST)

    శ్రీలంక ముందు భారీ టార్గెట్..

    బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 67 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో టీమిండియా 446ల ఆధిక్యాన్ని సాధించింది. ఈమేరకు శ్రీలంక టీం ముందు 447 పరుగల టార్గెట్‌ను ఉంచింది.


  • 13 Mar 2022 08:42 PM (IST)

    8 వికెట్లు కోల్పోయిన భారత్..

    టీమిండియా ప్రస్తుతం 8 వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం ఆధిక్యం 435 పరుగులకు చేరింది. శ్రేయాస్ అయ్యర్ 67 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

  • 13 Mar 2022 07:55 PM (IST)

    శ్రేయాస్ హాఫ్ సెంచరీ..

    శ్రేయాస్ అయ్యర్(53 పరుగులు, 70 బంతులు, 7 ఫోర్లు) మరో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. జడేజాతో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మిస్తూ టీమిండియాను భారీ ఆధిక్యం దిశగా తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం 5 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. మొత్తంగా ఆధిక్యం 390 పరుగులకు చేరింది.

  • 13 Mar 2022 06:43 PM (IST)

    భారీ ఆధిక్యం..

    బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ డిన్నర్ సమయానికి 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 18, రవీంద్ర జడేజా 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో టీమిండియా ఆధిక్యం 342 పరుగులకు చేరింది. 50 పరుగుల వద్ద పంత్ ఔటయ్యాడు.

  • 13 Mar 2022 06:04 PM (IST)

    రిషబ్ పంత్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ..

    రిషబ్ పంత్(50) హాఫ్ సెంచరీ చేశాక పెవిలియన్ చేరాడు. అయితే ఈ క్రమంలో ఓ రికార్డును కూడా నెలకొల్పాడు. ఇప్పటి వరకు కపిల్ దేవ్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని బ్రేక్ చేశాడు. కపిల్ దేవ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, రిషబ్ పంత్ మాత్రం కేవలం 28 బంతుల్లోనే పూర్తి చేసి భారత ఆటగాళ్లలో అగ్రస్థానంలో నిలిచాడు.

    టెస్ట్ క్రికెట్‌లో భారతదేశం తరపున అత్యంత వేగంగా నమోదైన హాఫ్ సెంచరీలు..

    28 రిషబ్ పంత్ vs SL బెంగళూరు 2022 *

    30 కపిల్ దేవ్ vs పాక్ కరాచీ 1982

    31 శార్దూల్ ఠాకూర్ vs ఇంగ్లండ్ ఓవల్ 2021

    32 V సెహ్వాగ్ vs చెన్నై 200

  • 13 Mar 2022 05:33 PM (IST)

    మరోసారి కోహ్లీకి నిరాశే..

    విరాట్ కోహ్లీ(13) సెంచరీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. దీంతో తన 71 సెంచరీ కోసం మరికొన్నాళ్లు వేచి చూడక తప్పదు. ప్రస్తుతం 4 వికెట్లు కోల్పోయిన భారత్ 140 పరుగులు చేసి, ఆధిక్యాన్ని 284 పరుగులకు చేరింది.

  • 13 Mar 2022 05:21 PM (IST)

    మూడో వికెట్ డౌన్..

    హనుమ విహారి(35) రూపంలో టీమిండియా మూడో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. మొత్తంగా భారత్ ఆధిక్యం 270 పరుగులకు చేరింది.

  • 13 Mar 2022 05:09 PM (IST)

    రోహిత్ ఔట్..

    రోహిత్ శర్మ(46) రూపంలో టీమిండియా రెండో వికెట్‌ను కోల్పోయింది. అర్థసెంచరీకి చేరువలో ఉన్న రోహిత్, భారీ షాట్ ఆడబోయి బౌండరీ లైన్ వద్ద మాథ్యూస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. మొత్తంగా భారత్ ఆధిక్యం 247 పరుగులకు చేరింది.

  • 13 Mar 2022 04:56 PM (IST)

    హాఫ్ సెంచరీ భాగస్వామ్యం..

    రోహిత్ శర్మ(40), హనుమ విహారి(26) ఇద్దరు కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పుతూ టీమిండియాను భారీ ఆధిక్యం దిశగా తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఒక వికెట్ కోల్పోయిన 96 పరుగులు చేసింది. మొత్తంగా ఆధిక్యం 239 పరుగులకు చేరింది.

  • 13 Mar 2022 03:37 PM (IST)

    మయాంక్ అగర్వాల్ ఔట్..

    రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. ఈ క్రమంలో మయాంక్ అగర్వాల్(22) ఎంబుల్దినియా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో 42 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.

  • 13 Mar 2022 02:32 PM (IST)

    109 పరుగులకే లంక ఆలౌట్..

    బెంగళూరు వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌటైంది. ఏంజెలో మాథ్యూస్ (43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో ఆర్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమీ చెరో 2 వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ ఖాతాలో ఓ వికెట్ చేరింది. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగుల ఆధిక్యం సాధించింది.

  • 13 Mar 2022 02:28 PM (IST)

    9 వికెట్లు కోల్పోయిన లంక..

    శ్రీలంక టీం తడబడుతూనే ఉంది. ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం లంక టీం 9 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. ఇంకా 143 పరుగుల వెనుకంజలోనే నిలిచింది.

Follow us on