శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 184 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 17.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ అజేయంగా 74 (44 బంతుల్లో), రవీంద్ర జడేజా అజేయంగా 45 (18 బంతుల్లో) పరుగులు చేశారు. సంజూ శాంసన్ 39 పరుగులు చేశాడు.
టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్‌కు ఇది వరుసగా 11వ విజయం. భారత్ కేవలం మరో విజయంతో ప్రపంచ రికార్డును సమం చేసేందుకు సిద్ధమైంది. ఆఫ్ఘనిస్థాన్ వరుసగా 12 టీ20 మ్యాచ్‌లు గెలిచింది. సొంతగడ్డపై ఈ ఫార్మాట్‌లో భారత్ వరుసగా ఏడో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీం నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 5 వికెట్లు కోల్పోయి 183 పరుగులు సాధించింది. దీంతో టీమిండియా ఎదుట 184 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. టీంలో నిస్సాంక 75 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో షనక కేవలం 19 బంతుల్లో 47 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో 5 సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్, బుమ్రా, హర్షల్ పటేల్, చాహల్, జడేజా తలో వికెట్ పడగొట్టారు.
భారత్-శ్రీలంక మధ్య నేడు ధర్మశాలలో రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈరోజు ఆ జట్టు సిరీస్‌ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. లక్నో వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది.
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, దినేష్ చండిమాల్(కీపర్), దసున్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, ప్రవీణ్ జయవిక్రమ, బినుర ఫెర్నాండో, లహిరు కుమార
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్
శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 184 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 17.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్‌కు ఇది వరుసగా 11వ విజయం. భారత్ కేవలం మరో విజయంతో ప్రపంచ రికార్డును సమం చేసేందుకు సిద్ధమైంది. ఆఫ్ఘనిస్థాన్ వరుసగా 12 టీ20 మ్యాచ్‌లు గెలిచింది.
రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను గెలుచుకుంది. దీంతో టీమిండియా వరుసగా 11 టీ20లను గెలిచింది. అలాగే రోహిత్ కెప్టెన్సీలో వరుసగా 8వ టీ20 గెలిచింది.
టీమిండియా విజయానికి మరో 24 బంతుల్లో కేవలం 9 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో శ్రేయాస్ అయ్యర్ 69, జడేజా 39 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
టీమిండియా విజయానికి మరో 5 ఓవర్లలో 31 పరుగులు సాధించాల్సి ఉంది. చేతిలో ఇంకా 7 వికెట్లు ఉన్నాయి. క్రీజులో శ్రేయాస్ అయ్యర్ 69, జడేజా 18 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
ఓవైపు శ్రేయాస్, మరోవైపు శాంసన్ బౌండరీలతో ట్రీట్ చేస్తోన్న టైంలో కుమార భారీ దెబ్బ తీశాడు. భారీ షాట్ ఆడే క్రమంలో శాంసన్(39 పరుగులు, 25 బంతులు, 2 ఫోర్లు, 3 సిక్సులు) పెవిలియన్ చేరాడు. దీంతో 128 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ను కోల్పోయింది.
భారీ స్కోర్ ఛేజింగ్ చేస్తోన్న భారత్.. ప్రస్తుతం 100 పరుగులు దాటింది. క్రీజులో శ్రేయాస్ అయ్యర్ 64, శాంసన్ 17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
కీలక ఇన్నింగ్స్ ఆడుతోన్న శ్రేయాస్ అయ్యర్ 30 బంతుల్లో తన అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 5 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా 11 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది.
10 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 80 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో శ్రేయాస్ 45, శాంసన్ 14 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియా విజయం సాధించాలంటే 60 బంతుల్లో 104 పరుగులు చేయాల్సి ఉంది.
రెండు వికెట్లు కోల్పోయిన భారత్.. ప్రస్తుతం 7 ఓవర్లు పూర్తయ్యే సరికి 51 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో శ్రేయాస్ 28, శాంసన్ 2 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
ఇషాన్ కిషన్(16 పరుగులు, 15 బంతులు, 2 ఫోర్లు) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో 44 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ను కోల్పోయింది.
భారత్‌కు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్, ఇషాన్‌లు బ్యాటింగ్‌కు దిగారు. చమీరా వేసిన మొదటి ఓవర్, చివరి బంతికి రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ తొమ్మిది పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీం నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 5 వికెట్లు కోల్పోయి 183 పరుగులు సాధించింది. దీంతో టీమిండియా ఎదుట 184 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. టీంలో నిస్సాంక 75 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో షనక కేవలం 19 బంతుల్లో 47 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో 5 సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి.
శ్రీలంక టీం ఓపెనర్ నిస్సాంక(75 పరుగులు, 53 బంతులు, 11 ఫోర్లు) భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ తన అర్థ సెంచరీని పూర్తి చేశాడు. సెంచరీ దిశగా సాగుతోన్న ఈ బ్యాట్స్‌మెన్‌ను భువనేశ్వర్ 18.6 బంతికి బోల్తాకొట్టించాడు. దీంతో 160 పరుగుల వద్ద శ్రీలంక టీం 5వ వికెట్‌ను కోల్పోయింది.
శ్రీలంక టీం ఓపెనర్ నిస్సాంక భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ తన అర్థ సెంచరీని పూర్తి చేశాడు. 43 బంతుల్లో 7 ఫోర్లతో తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ప్రస్తుతం 16 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు సాధిచింది.
బుమ్రా బౌలింగ్‌లో శ్రీలంక టీం నాలుగో వికెట‌్‌ను కోల్పోయింది. ఛండీమల్ (9) పరుగుల వద్ద రోహిత్ శర్మ క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. దీంతో 102 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయింది.
హర్షల్ పటేల్ బౌలింగ్‌లో శ్రీలంక టీం మూడో వికెట్ను కోల్పోయింది. మిషర (1) పరుగుల వద్ద శ్రేయాస్ అయ్యర్ లోయర్ క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. దీంతో 76 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయింది.
చాహల్ బౌలింగ్‌లో శ్రీలంక టీం రెండో వికెట్ను కోల్పోయింది. అసలంక (2) పరుగుల వద్ద ఎల్బీగా ఔటయ్యాడు. దీంతో 71 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయింది.
దూకుడుగా ఆడుతోన్న శ్రీలంక ఓపెనర్లను జడేజా ఎట్టకేలకు విడదీశాడు. 8 వ ఓవర్‌లో వరుసగా బౌండరీ బాదుతూ భారత శిబిరంలో తీవ్ర ఒత్తిడి పెంచిన గుణతిలక(38 పరుగులు, 29 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు)ను బోల్తా కొట్టించాడు. భారీ షాట్ ఆడబోయి వెంకటేష్ అయ్యర్‌కు చిక్కాడు. దీంతో శ్రీలంక టీం 67 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తోన్న శ్రీలంక టీంకు ఓపెనర్లు నిస్సాంక 8, గుణతిలక 13 పరుగులతో మంచి భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. ఇద్దరూ కలిసి 5 ఓవర్లు ముగిసే సరికి 25 పరుగులు జట్టు స్కోర్ బోర్టులో చేర్చారు.
టాస్ ఓడిన శ్రీలంక టీం తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఈ మేరకు ఓపెనర్లుగా నిస్సాంక, గుణతిలక ఓపెనర్లుగా బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి వచ్చారు.
గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో మైదానం ఔట్ ఫీల్డ్ తడిగా ఉంది. టాస్ వరకు అంతా సవ్యంగానే సాగాలని గ్రౌండ్స్‌మెన్ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, దినేష్ చండిమాల్(కీపర్), దసున్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, ప్రవీణ్ జయవిక్రమ, బినుర ఫెర్నాండో, లహిరు కుమార
రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచింది. దీంతో బౌలింగ్ ఎంచుకుంది. ఈమేరకు శ్రీలంక టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచులో భారత్ 62 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. గత మ్యాచ్‌లో అద్భుతమైన ఫామ్‌లో కనిపించిన రోహిత్ సేన ఈరోజు కూడా అదే జోరు కొనసాగించాలనుకుంటోంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా భారత్-శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌కు సిరీస్‌ను చేజిక్కించుకుంటుంది.