India Vs South Africa: టెస్టు సిరీస్ తర్వాత టీమిండియా (India Vs South Africa) వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది. పార్ల్‌లో జరిగిన రెండో వన్డలో ఆతిథ్య దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించి, 3 వన్డేల సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ఇక కేప్ టౌన్ వేదికగా జరగనున్న చివరి వన్డేలో భారత జట్టు క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకుంటుందా లేదా అనేది చూడాలి. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో టీమిండియా ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. రెండో వన్డేలో భారత్ తరఫున అత్యధిక ఇన్నింగ్స్ ఆడిన వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(Rishabh Pant) మాట్లాడుతూ, వన్డే సిరీస్‌ను భారత్ కోల్పోవడానికి అసలు కారణాన్ని వెల్లడించాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ రెండు జట్ల మధ్య భారీ తేడాను చూపించిందని అంటున్నాడు.
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన వన్డే సిరీస్‌లోని మొదటి మ్యాచ్ కూడా పార్ల్‌లోనే జరిగింది. ఇందులో ఆతిథ్య జట్టు 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీని తర్వాత రెండో వన్డేలో పునరాగమనం జరుగుతుందని భావించారు. అయితే స్కోరు బోర్డుపై 287 పరుగులు పెట్టినా భారత్ విజయం సాధించలేకపోయింది. పార్ల్ స్లో వికెట్‌పై ఈ పరుగులు సరిపోతాయనుకున్నా.. మేం ఓడిపోయామని రిషబ్ పంత్ మ్యాచ్ తర్వాత వెల్లడించాడు.
మిడిల్ ఆర్డర్ దెబ్బ కొట్టిందా..
పంత్ మాట్లాడుతూ, “మొదటి వన్డేలో, మేం ఛేజింగ్ చేశాం. రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేశాం. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలించింది. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో కాస్త నెమ్మదించింది. రెండో వన్డేలోనూ అదే కనిపించింది. కానీ, దక్షిణాఫ్రికా మిడిల్ ఓవర్లలో అద్బుతంగా బ్యాటింగ్ చేసింది. దీని కారణంగా మేం ఓడిపోయాం. 287 పరుగులను ఛేదించి విజయం సాధించారు. అలాగే మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంలో మేం విఫలమయ్యాం” అంటూ చెప్పుకొచ్చాడు.
అశ్విన్, చాహల్ కంటే దక్షిణాఫ్రికా స్పిన్నర్లు బెటర్..
ఎడమచేతి వాటం వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ మాట్లాడుతూ, భారత బౌలింగ్‌లోని లోపాలను వివరించాడు. అశ్విన్, చాహల్ కంటే దక్షిణాఫ్రికా స్పిన్నర్లు మెరుగ్గా బౌలింగ్ చేశారని అంగీకరించాడు. కేశవ్ మహారాజ్, ఐడెన్ మర్క్రామ్, తబ్రేజ్ షమ్సీ మంచి లైన్ లెంగ్త్‌లో బౌలింగ్ చేశారన్నాడు.
ఓటమికి అతి పెద్ద కారణం గురించి మాట్లాడితే, భారత జట్టు యాభై ఓవర్ల ఫార్మాట్‌లోనూ వన్డే సిరీస్‌ను కోల్పోవడం గురించి మాట్లాడుతూ, చాలా కాలం తర్వాత వన్డేలు ఆడుతున్నాం. ఇలాంటి పరిస్థితిలో, జట్టు గురించి చాలా విషయాలు బయటకు రావొచ్చు. మన తప్పులను మనం సరిదిద్దుకోవాలి. రాబోయే మ్యాచ్‌లలో మా లోపాలను సరిదిద్దుకుని క్లీన్ స్వీప్ కాకుండా చూసుకుంటాం అని తెలిపాడు.
Also Read: 18 ఏళ్లలో 11 టెస్టులు.. కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టిన భారత స్పిన్నర్.. ఆయనెవరో తెలుసా?
Sudhir Kumar Chaudhary: సచిన్ టెండూల్కర్ వీరాభిమానిపై పోలీసుల దాడి..!