IND vs SA ODI Series: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు ప్రస్తుతం వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. జనవరి 19 నుంచి ప్రారంభమయ్యే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా(IND vs SA) మూడు వన్డేల సిరీస్ కోసం బోలాండ్ పార్క్‌లో టీమిండియా ప్రాక్టీస్ ప్రారంభించింది. మొదటి, రెండో వన్డే బోలాండ్ పార్క్‌లోనే జరగనుంది. టీమ్ ఇండియాకు సంబంధించిన కొన్ని ఫొటోలను బీసీసీఐ(BCCI) ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid), వన్డే కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) జట్టులోని మిగతా ఆటగాళ్లతో మ్యాచ్ ప్లానింగ్‌ను వివరిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఒక ఫొటోలో కోచ్, కెప్టెన్ సలహాలను శ్రద్ధగా వింటూ కనిపించాడు.
దక్షిణాఫ్రికా నుంచి హెడ్ టు హెడ్ రికార్డులు:
ఇప్పటివరకు భారత్-దక్షిణాఫ్రికా మధ్య 84 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో టీమిండియా 35 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, దక్షిణాఫ్రికా 46 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 3 మ్యాచ్‌ల్లో ఫలితం లేదు.
దక్షిణాఫ్రికాలో భారత జట్టు..
దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు 34 వన్డేలు ఆడిన టీమిండియా 10 మ్యాచ్‌లు మాత్రమే గెలవగా, ప్రొటీస్ జట్టు 22 విజయాలు సాధించింది. ఇక్కడ 2 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.
మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయంటే?
ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ జనవరి 19న పార్ల్‌లోని బోలాండ్ పార్క్‌లో జరగనుంది. రెండో మ్యాచ్ జనవరి 21న జరగనుంది. ఇది కూడా బోలాండ్ పార్క్‌లోనే జరగనుంది. ఇక మూడో మ్యాచ్ జనవరి 23న కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. అన్ని మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.
మ్యాచులను ప్రత్యక్ష ప్రసారం ఎలా చూడాలి?
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టీంల మధ్య మూడు వన్డేల సిరీస్‌లోని మ్యాచులన్నీ స్టార్ స్పోర్ట్స్ లైవ్ కవరేజీ ఇవ్వనుంది. ఇక ఆన్‌లైన్‌లో చూడాలంటే మాత్రం డిస్నీ హాట్‌స్టార్ యాప్‌లో చూడొచ్చు.
ODI MODE ?
We are here at Boland Park to begin prep for the ODIs ??#TeamIndia | #SAvIND pic.twitter.com/psMVDaNwbc
— BCCI (@BCCI) January 17, 2022