IND vs SA: ఈసారి ట్రోఫీ రోహిత్ సేనదే.. ఇక అడ్డుకోవడం ఎవరి వల్ల కాదంటోన్న ఫ్యాన్స్.. కారణమేంటో తెలుసా?

Rohit Sharma Stands Right Side During the Photoshoot With T20 World Cup Trophy: ఈసారి టీ20 ప్రపంచ కప్ తొమ్మిదో ఎడిషన్ చివరి మ్యాచ్‌లో టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా (IND vs SA) జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. మెగా మ్యాచ్‌కు ముందు, ఐడెన్ మార్క్‌రామ్, రోహిత్ శర్మ ధగధగా మెరుస్తున్న ట్రోఫీతో ఫొటోషూట్ చేశారు.

IND vs SA: ఈసారి ట్రోఫీ రోహిత్ సేనదే.. ఇక అడ్డుకోవడం ఎవరి వల్ల కాదంటోన్న ఫ్యాన్స్.. కారణమేంటో తెలుసా?
Ind Vs Sa Trophy

Updated on: Jun 29, 2024 | 12:26 PM

Rohit Sharma Stands Right Side During the Photoshoot With T20 World Cup Trophy: ఈసారి టీ20 ప్రపంచ కప్ తొమ్మిదో ఎడిషన్ చివరి మ్యాచ్‌లో టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా (IND vs SA) జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. మెగా మ్యాచ్‌కు ముందు, ఐడెన్ మార్క్‌రామ్, రోహిత్ శర్మ ధగధగా మెరుస్తున్న ట్రోఫీతో ఫొటోషూట్ చేశారు. ఫొటోషూట్ బయటకు రావడంతో, భారతీయ అభిమానులు సంతోషిస్తున్నారు. ఈసారి రోహిత్ సరైన స్థానంలో నిలిచాడని వారు అంటున్నారు. ఈసారి రోహిత్ శర్మ ట్రోఫీ గెలవడం ఖాయమని పలువురు అభిమానులు పేర్కొంటున్నారు.

ఫొటోషూట్ సమయంలో కుడి వైపున నిల్చున్న రోహిత్ శర్మ..

రోహిత్ శర్మ కెప్టెన్సీలో, భారత జట్టు ఇప్పటికే ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (2023) ఫైనల్‌ను, 2023 ప్రపంచ కప్‌లో ఫైనల్‌ను ఆడింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ రోహిత్ శర్మతో కలిసి ఫోటోషూట్‌లో పాల్గొన్నాడు. ఆ సమయంలో ట్రోఫీకి ఎడమవైపు రోహిత్‌, కుడివైపు కమిన్స్‌ నిలబడ్డారు. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

అదే సమయంలో, 2023 ప్రపంచ కప్ ఫోటోషూట్ సమయంలో, రోహిత్ ట్రోఫీకి ఎడమ వైపున నిలబడి, కమిన్స్ కుడి వైపున పోజులిచ్చాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగగా.. ఆస్ట్రేలియా మరోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది.

రెండు మ్యాచ్‌ల ఫలితాలను చూసిన తర్వాత, ట్రోఫీకి కుడి వైపున నిలబడిన కెప్టెన్ ఫైనల్ మ్యాచ్‌లో గెలుస్తాడని చాలా మంది అభిమానుల నమ్మకం ఏర్పడింది. ఈసారి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ ఫోటోషూట్ సమయంలో రోహిత్ శర్మ కుడి వైపున నిలబడి కనిపించాడు. అందుకే ఫైనల్‌లో టీమిండియా గెలవాలని అభిమానులు పేర్కొంటున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఐసీసీ షేర్ చేసిన ఫోటోషూట్ ఫోటోపై అభిమానుల నుంచి ఎన్నో స్పందనలు కనిపిస్తున్నాయి. ఒక అభిమాని.. ‘ఈసారి రోహిత్ కుడి వైపున నిలబడి సరైన పని చేశాడు. ఇప్పుడు మనం ట్రోఫీని గెలవకుండా ఎవరూ ఆపలేరు’ అంటూ చెప్పుకొచ్చారు. మరో వినియోగదారు రోహిత్ భాయ్, కుడి వైపున నిలబడండి అంటూ రాసుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..