Asia Cup 2023: భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 2న శ్రీలంకలోని కాండీ నగరంలోని పల్లెకల్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:00 గంటలకు జరగనుంది. ఆసియా కప్ 2023 టైటిల్ గెలవడానికి భారత్ బలమైన పోటీదారుగా పరిగణిస్తున్నారు. ఈ గ్రేట్ మ్యాచ్‌కి ముందు భారీ అంచనాలు వెలువడుతున్నాయి. పాక్ బౌలర్ వేసే ఆ 3 ఓవర్లు టీమిండియాకు అత్యంత ప్రమాదకరం అంటున్నారు. UAE 2021 టీ20 ప్రపంచ కప్ లాంటి పరిస్థితిని ఎదుర్కొవడానికి పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది మొదటి మూడు ఓవర్లలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ జాగ్రత్తగా ఉండాలని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ కోరుతున్నాడు.
2021 టీ20 ప్రపంచకప్‌లో షహీన్ షా ఆఫ్రిది ఇన్‌సైడ్ యార్కర్ బంతికి రోహిత్ బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఖాతా తెరవడంలో విఫలమయ్యాడు. ఈ గ్రూప్ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ టోర్నీలో ఓటమి షాక్ నుంచి కోలుకోలేకపోయింది. పాకిస్థాన్‌కు చెందిన ఈ పొడవాటి ఫాస్ట్ బౌలర్‌ను ఎదుర్కోవడానికి ఇదే సరైన మార్గమని హేడెన్ అభిప్రాయపడ్డాడు. స్టార్ స్పోర్ట్స్‌తో హేడెన్ మాట్లాడుతూ, ‘మొదట్లో షాహీన్ అఫ్రిదిపై జాగ్రత్తగా ఆడాలి. ఇటీవలి (T20) ప్రపంచ కప్ (2021లో UAEలో)ను గుర్తుంచుకోండి. తొలి ఓవర్లలోనే షాహీన్ వికెట్లు తీయగలిగాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
Hello Sri Lanka 🇱🇰 #TeamIndia | #AsiaCup2023 pic.twitter.com/TXe0NXhMFt
— BCCI (@BCCI) August 30, 2023
‘రోహిత్ శర్మకు అతడు వేసిన బంతిని ఎప్పటికీ మరచిపోలేం. కాబట్టి అతనిపై కొంచెం జాగ్రత్తగా ఉండండి’ అంటూ హేడెన్ భారత కెప్టెన్‌కు సలహా ఇచ్చాడు. అది స్వింగ్ అయితే, మొదటి మూడు ఓవర్లు ఆడటంపై దృష్టి పెట్టాలి. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 49 బంతుల్లో 57 పరుగులు చేసి భారత ఇన్నింగ్స్‌ను అలంకరించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఆ జట్టు 10 వికెట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అఫ్రిదితో పాటు, భారత బ్యాట్స్‌మెన్ కూడా నసీమ్ షా, హరీస్ రవూఫ్‌లకు వ్యతిరేకంగా తమ బ్యాటింగ్‌ను ప్లాన్ చేయాల్సి ఉంటుందని హేడెన్ చెప్పుకొచ్చాడు.
As the #AsiaCup2023 kicks off! Sending my best wishes to all the teams gearing up to showcase their cricketing prowess. May the tournament be a celebration of skill, sportsmanship, and unforgettable moments. Let’s celebrate the spirit of cricket together. @ACCMedia1 pic.twitter.com/OQKolRT5CS
— Jay Shah (@JayShah) August 30, 2023
చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే మ్యాచ్‌ను ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌గా అభివర్ణించిన హేడెన్, ‘పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ల త్రయంతో భారత్ ఆడనుంది. క్రికెట్‌లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న మ్యాచ్‌ల్లో ఇదొకటి. పాకిస్థాన్‌లో షహీన్ ఆఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ (షా) వంటి సమర్థులైన బౌలర్లు ఉన్నారు. మూడు విభిన్న రకాల బౌలర్లు, భారత జట్టు వారిని ఎదుర్కోవడానికి ఒక ప్రణాళికతో ముందుకు రావాలి. హేడెన్ మాట్లాడుతూ, ‘కాండీలో పరిస్థితులు ఫాస్ట్ బౌలర్లకు ఉపయోగపడతాయి. పిచ్ బౌన్స్‌పై ఓ కన్నేసి ఉంచాలి. ఈ విషయంలో హరీస్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అతను ఆఫ్ స్టంప్ దగ్గర బంతిని బలంగా విసిరికొడతాడంటూ’ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..