
India vs Ireland T20 Series: డబ్లిన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 2 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా టీమ్ ఇండియా కమాండ్ తీసుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. అయితే తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ప్లేయింగ్ 11లో ఓ ఆటగాడికి మాత్రం చోటు దక్కలేదు. ఈ సిరీస్‌లోనూ ఈ ఆటగాడికి ఆడే అవకాశం రాలేదు.
వెస్టిండీస్‌తో జరిగిన పొట్టి ఫార్మాట్లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్‌కు అవకాశం రాలేదు. ఇప్పుడు ఐర్లాండ్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో కూడా తన స్థానాన్ని సంపాదించుకోలేకపోయాడు. అవేష్ ఖాన్ ఆసియా కప్ 2022 సందర్భంగా టీమిండియా తరపున తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి టీమ్ఇండియాలో చోటు దక్కించుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు.
అవేశ్ ఖాన్ భారత్ తరపున 15 టీ20లు ఆడాడు. అలాగే 5 వన్డేలు కూడా ఆడాడు. పొట్టి పార్మాట్ లో అవేశ్ ఖాన్ 9.11 ఎకానమీతో పరుగులు ఇచ్చి 13 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అదే సమయంలో వన్డేల్లో 3 వికెట్లు పడగొట్టాడు. 2022 అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాపై టీమ్ ఇండియా తరపున తన చివరి ODI ఆడాడు. 2022 ఆసియా కప్‌లో టీమిండియా ఓటమికి అవేష్ ఖాన్ ఓ కారణమయ్యాడు.
జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రితురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రముఖ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్.
1వ T20 మ్యాచ్ – 18 ఆగస్ట్ – డబ్లిన్, 2 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు
2వ T20 మ్యాచ్ – 20 ఆగస్ట్ – డబ్లిన్
3వ T20 మ్యాచ్ – 23 ఆగస్ట్ – డబ్లిన్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..