India vs Ireland Full Schedule T20I Series: ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ విడుదలైంది. ఈసారి టోర్నీని భారత్‌లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌నకు ముందు టీమిండియా 4 దేశాలతో సిరీస్‌లు ఆడనుంది. ఈ జాబితాలో ఐర్లాండ్ పేరు కూడా చేరింది. జులైలో వెస్టిండీస్ పర్యటన తర్వాత భారత జట్టు ఆగస్టులో ఐర్లాండ్‌లో పర్యటించనుంది. అక్కడ 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ మేరకు తాజాగా భారత్ వర్సెస్ ఐర్లాండ్ షెడ్యూల్ విడుదలైంది.
కాగా, వెస్టిండీస్‌తో జులై-ఆగస్టు నెలల్లో భారత జట్టు టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఆ తర్వాత ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియా, ఐర్లాండ్ మధ్య ఆగస్టు 18న తొలి టీ20ఐ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత రెండో మ్యాచ్ ఆగస్టు 20న జరగనుంది. సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ ఆగస్టు 23న జరగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ మలాహిడేలో జరనున్నాయి.
గత ఏడాది కూడా ఈ రెండు దేశాల మధ్య 2 మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. భారత్ 2-0తో విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టీమిండియా మొదటి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2వ మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ సిరీస్ జూన్ చివరి వారంలో జరిగింది. అయితే ఈసారి ఆగస్ట్‌లో జరగనుంది.
2022లో జరిగిన రెండు దేశాల టీ20ఐ సిరీస్‌లో సంజూ శాంసన్, దీపక్ హుడాలు భారత జట్టులో భాగంగా ఉన్నారు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా దీపక్ హుడా 151 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. సంజూ శాంసన్ 3వ స్థానంలో నిలిచాడు. ఒక మ్యాచ్‌లో శాంసన్ 77 పరుగులు చేశాడు. భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్ జట్టులో భాగంగా ఉన్నారు. భువనేశ్వర్ రెండు మ్యాచ్‌ల్లో రెండు వికెట్లు పడగొట్టగా, చాహల్ ఒక వికెట్ పడగొట్టాడు.
మొదటి టీ20ఐ మ్యాచ్ – 18 ఆగస్టు, మలాహిడ్.
రెండవ టీ20ఐ మ్యాచ్ – 20 ఆగస్టు, మలాహిడ్.
మూడో టీ20ఐ మ్యాచ్ – 23 ఆగస్టు, మలాహిడ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..