India vs Leicestershire: భారత్‌ను టెన్షన్ పెట్టిన ప్రాక్టీస్ మ్యాచ్.. నిరాశపరిచిన ఆ ఇద్దరూ.. ద్రవిడ్ చూపు ఎటువైపో?

15 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ను గెలుచుకునే అవకాశం భారత్‌కు ఉంది. అయితే దీని కోసం చివరి టెస్ట్‌లో విజయం సాధించడం అవసరం. అయితే, మూడో స్థానంపై మాత్రం టెన్షన్ మాత్రం తగ్గడం లేదు.

India vs Leicestershire: భారత్‌ను టెన్షన్ పెట్టిన ప్రాక్టీస్ మ్యాచ్.. నిరాశపరిచిన ఆ ఇద్దరూ.. ద్రవిడ్ చూపు ఎటువైపో?
Ind Vs Eng
Venkata Chari

|

Jun 24, 2022 | 8:22 PM

గత దశాబ్ద కాలంగా ఇంగ్లండ్ పర్యటన టీమ్ ఇండియా(Team India)కు మేలు చేయలేదు. 2007లో చివరిసారిగా ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ గెలిచినప్పటి నుంచి భారత్‌ ఇక్కడ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈసారి భారత జట్టు చారిత్రక విజయానికి చేరువైంది. గతేడాది ప్రారంభమైన టెస్టు సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్.. ఇప్పుడు చివరి టెస్టు సవాల్‌ను ఎదుర్కోవాల్సి ఉంది. చివరి టెస్టులో విజయంతో సిరీస్ భారత్ ఒడికి చేరుతుంది. కానీ, ఇంగ్లండ్(England Cricket Team) సవాల్.. అంత సులభంగా ఏం లేదు. మరి ఈసారి కూడా అదే జరుగుతుందా? లేదా చూడాలి. ఐదో టెస్టుకు ముందు జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో తెరపైకి వచ్చిన టీమ్ ఇండియా బ్యాటింగ్ లోపంతో.. చివరి టెస్టులో విజయం సొంతమయ్యేనా లేదా అనే సందిగ్ధం ఏర్పడింది. ముఖ్యంగా మూడో నంబర్ బ్యాట్స్‌మెన్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

జులై 1 నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో, చివరి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టు మ్యాచ్‌కు ముందు భారత జట్టు ఇంగ్లీష్ కౌంటీ క్లబ్ లీసెస్టర్‌షైర్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ఇప్పటివరకు భారత జట్టుకు అంతగా కలసిరాలేదు. ముఖ్యంగా ప్లేయింగ్ XIలో ఆడాలని నిర్ణయించుకున్న ఆటగాళ్ల కోణం నుంచి చూస్తే మాత్రం.. మూడో నంబర్ స్థానం టీమిండియా హెడ్ కోచ్ ద్రవిడ్‌ను కలవరపెడుతోంది.

ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇద్దరూ విఫలం..

లీసెస్టర్‌షైర్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ కోసం, జట్టు ఆటగాళ్లందరికీ అవకాశం కల్పించేందుకు ఇంగ్లీష్ క్లబ్ ప్లేయింగ్ XIలో కొంత మంది సభ్యులను చేసింది. దీని కారణంగా, పుజారాను లీసెస్టర్‌షైర్‌తో, విహారిని టీమ్ ఇండియాతో ఉంచారు. అయితే ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు మొదటి ఇన్నింగ్స్‌లో ప్రభావం చూపలేకపోయారు. మ్యాచ్ మొదటి రోజు, విహారి టీమ్ ఇండియా తరుపున మూడో స్థానంలో బ్యాటింగ్ చేసినా 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు. శుక్రవారం రెండో రోజు, పుజారా వంతు వచ్చింది. సుమారు 90 టెస్ట్ మ్యాచ్‌ల అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ కూడా నిరాశపరిచాడు. 6 బంతులు మాత్రమే ఆడగలిగిన అతను ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు.

పుజారా లేదా విహారి: ఎవరికి అవకాశం వస్తుంది?

ఇవి కూడా చదవండి

కాగా, గత దశాబ్ద కాలంగా టీమిండియా ఈ స్థానాన్ని ఛెతేశ్వర్‌ పుజారా ఆక్రమించాడు. గతేడాది ఇంగ్లండ్‌లో ఆడిన నాలుగు టెస్టుల్లోనూ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే చాలా నెలలుగా కొనసాగుతున్న పేలవమైన ఫామ్ కారణంగా అతను తన స్థానాన్ని కోల్పోయాడు. అయితే, అతను ఇంగ్లాండ్‌లో ఆడిన అనుభవం, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో కూడా ఆకట్టుకోవడంతో, మరలా టెస్ట్ జట్టులోకి ఎంట్రీ లభించింది. అదే సమయంలో గత సిరీస్‌లో అతని స్థానంలో హనుమ విహారికి అవకాశం లభించింది. రాబోయే కాలంలో మరిన్ని అవకాశాలు ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ సూచించింది. ఇటువంటి పరిస్థితిలో, ఈ నిర్ణయాత్మక టెస్ట్‌కు ఎవరికి అవకాశం లభిస్తుంది. ఈ నిర్ణయం ప్రాక్టీస్ మ్యాచ్ ప్రదర్శనపై చాలా వరకు ప్రభావం చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ టెస్టులో బ్యాట్స్‌మెన్స్ ఇద్దరూ నిరాశ పరిచారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu