IND Vs AUS: పేరుకే నెంబర్ వన్.. అశ్విన్ దెబ్బకు వణికిపోవాల్సిందే.. ఆసీస్‌ బేజారు..

|

Feb 17, 2023 | 3:56 PM

ఢిల్లీ టెస్టులో ఆస్ట్రేలియా ఫర్వాలేదనిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు.. ఆ జట్టు ఓపెనర్లు..

IND Vs AUS: పేరుకే నెంబర్ వన్.. అశ్విన్ దెబ్బకు వణికిపోవాల్సిందే.. ఆసీస్‌ బేజారు..
Ind Vs Aus
Follow us on

ఢిల్లీ టెస్టులో ఆస్ట్రేలియా ఫర్వాలేదనిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు.. ఆ జట్టు ఓపెనర్లు వార్నర్‌, ఉస్మాన్‌ ఖవాజా హాఫ్‌ సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలోనే ఖవాజా(81) అదిరిపోయే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 19 పరుగులతో సెంచరీ మిస్ చేసుకుని.. రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయితే సరిగ్గా లంచ్ సెషన్‌కి కొద్ది సమయం ముందుగా.. టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్‌లో టెస్టు స్పెషలిస్టులు స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్‌ను పెవిలియన్ పంపించాడు. కేవలం 3 బంతుల వ్యవధిలో ఈ ఇద్దరు ఆటగాళ్లను ఔట్ చేశాడు. అలాగే స్మిత్‌ను టెస్టుల్లో రెండోసారి డకౌట్ చేయడం.. ఒక్క అశ్విన్‌కు మాత్రమే సాధ్యమైంది.

అశ్విన్ బౌలింగ్‌లో ఖవాజా వరుసగా స్వీప్ షాట్స్ ప్రయత్నిస్తుండగా.. తన వ్యూహాన్ని మార్చిన ఈ స్పిన్ మాంత్రికుడు రౌండ్ ది వికెట్ బౌలింగ్ వేశాడు. ఈ క్రమంలోనే 18 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లబూషేన్ ఎల్బీడబ్ల్యూగా.. ఆ తర్వాత రెండో బంతికే స్టీవ్ స్మిత్ డకౌట్‌గా వెనుదిరిగారు. కాగా, ఆస్ట్రేలియాకు అశ్విన్ పెద్ద తలనొప్పిగా మారాడని చెప్పొచ్చు. అశ్విన్ లాంటి యాక్షన్ బౌలర్‌తో ప్రాక్టీస్ సెక్షన్లు చేసినప్పటికీ.. ఆసీస్ బ్యాటర్లు రియల్ అశ్విన్ స్పిన్ మాయలో పడి గిలగిలాకొట్టుకుంటున్నారు. టెస్టుల్లో ప్రపంచ నెంబర్ వన్, నెంబర్ 2 బ్యాటర్లు సైతం అతడి ముందు తలవంచాల్సిందే. మరోవైపు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు నష్టపోయి 245 పరుగులు చేసింది. ప్రస్తుతం హ్యాండ్స్‌కంబ్(62) అర్ధ సెంచరీతో ఒక ఎండ్‌లో.. ఆఫ్ స్పిన్నర్ లియాన్(10) మరో ఎండ్‌లో బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియా బౌలర్లలో జడేజా, అశ్విన్ చెరో 3 వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనంలో కీలక పాత్ర పోషించారు