Video: ‘బంతిని కొట్టండి, వికెట్లు పడగొట్టండి, విజయం అదే వస్తుంది’: భారత ఆటగాళ్లకు సద్గురు సూచన..

|

Nov 18, 2023 | 5:54 PM

వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ పోరుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. నవంబర్ 19న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. లీగ్ దశలో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించిన టీమ్ ఇండియా.. ఈసారి కూడా గెలుస్తామన్న విశ్వాసంతో ఉంది. దీంతో అభిమానుల్లోనూ ఉత్కంఠ మొదలైంది. ఈ క్రమంలో మాజీల నుంచి సెలబ్రెటీల వరకు భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు.

Video: బంతిని కొట్టండి, వికెట్లు పడగొట్టండి, విజయం అదే వస్తుంది: భారత ఆటగాళ్లకు సద్గురు సూచన..
Sadhguru
Follow us on

Sadhguru To Cheer For Team India: ప్రపంచ కప్ ఫీవర్ యావత్ దేశాన్ని టెన్షన్ పెడుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇదే ముచ్చట్లు వినిపిస్తున్నాయి. టీమిండియా ఈసారి ట్రోఫీ గెలుస్తుందని మాట్లాడుకుంటున్నారు. అయితే, ఈ మాజీల నుంచి ప్రముఖ సెలబ్రెటీల వరకు టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త, యోగి సద్గురు కూడా ఈ లిస్టులో చేరారు. భారత క్రికెట్ జట్టుకు తన మద్దతు పలికారు.

నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షించనున్న సద్గురు.. సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. “భారత జట్టుకు శుభాకాంక్షలు. అద్భుతంగా ఆడుతున్నారు. మన క్రికెట్ జట్టు ఆటను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకువెళ్లింది. 10కి 10 మ్యాచ్‌లు గెలవడం అంటే ఎంతో గొప్ప విషయం. బెస్ట్ కెప్టెన్సీలో భారత్ సత్తా చాటుతోంది. అలాగే, కెప్టెన్‌తోపాటు ఆటగాళ్లు కూడా అద్భుతమైన ప్రదర్శనలు, రికార్డులతో దూసుకెళ్తున్నారు. ఈ బలీయమైన జట్టు ఫైనల్స్ గురించి ఎటువంటి ఆందోళన చెందకూడదు’ అంటూ చెప్పుకొచ్చారు.

“ఖచ్చితంగా గెలుస్తారు”

“ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఎప్పుడూ వ్యతిరేకతను తేలికగా తీసుకోవద్దు. అవతల ఎంత బలమైన జట్టు ఉన్నా బాధపడొద్దు. పూర్తి స్థాయిలో గేమ్‌ను ఎలా ఆడాలనేది మన అబ్బాయిలకు తెలుసు. అలాగే చేస్తారని, దేశం మొత్తానికి గర్వం, ఆనందాన్ని ఇస్తారని నాకు నమ్మకం ఉంది. 1.4 బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలకు ఎంత ఆనందాన్ని ఇస్తారో తెలుసుకోండి. అది మర్చిపోవద్దు. అలా అని, మీపై అతిగా భారం వేసుకోవద్దు. బంతిని కొట్టండి, వికెట్లు పడగొట్టండి- అంతే! మిగిలినవి అవే జరుగుతాయి. జట్టులోని ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు” అంటూ సద్గురు సూచించారు.

“అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్స్ కోసం, నేను మీతో పాటు మ్యాచ్ చూస్తున్నాను” అంటూ సద్గురు వీడియోను ముగించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..