
ఇంగ్లాండ్ పర్యటనకు భారత్ ఎంపిక చేసిన టెస్ట్ జట్టులో శ్రేయాస్ అయ్యర్ పేరు లేకపోవడం భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున తన బ్యాటింగ్‌తో పాటు నాయకత్వ లక్షణాలను ప్రదర్శించిన ఈ ముంబై బ్యాట్స్‌మన్ టెస్ట్ జట్టులో స్థానం కోల్పోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా అతడు వన్డే ఫార్మాట్‌లోను, దేశవాళీ క్రికెట్‌లోను మంచి ఫామ్‌లో ఉండటంతో అతనిని విస్మరించడం అన్యాయంగా భావించిన అభిమానులు పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించడం మరింత ఆసక్తికరంగా మారింది. మీడియా సమావేశంలో శ్రేయాస్ ఎంపికపై గంభీర్‌ను ప్రశ్నించగా, అతను ఎంతో సరళంగా, కాని బలమైన సమాధానంగా “మెయిన్ సెలెక్టర్ నహీ హన్ (నేను సెలెక్టర్ కాదు)” అని వ్యాఖ్యానించాడు. ఈ ఒక్క వాక్యమే గంభీర్ తన బాధను ఎలా చక్కగా దాచుకున్నాడో చాటుతుంది. శ్రేయాస్‌తో గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో కలిసి పనిచేసిన అనుబంధం వల్ల గంభీర్‌కి అతనిపై గల సానుభూతి ఈ స్పందనలో స్పష్టంగా కనిపించింది.
ఇక శ్రేయాస్‌ను ఎందుకు ఎంపిక చేయలేదనే దానిపై సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ స్పష్టతనిచ్చాడు. “శ్రేయస్‌కు మంచి వన్డే సిరీస్ ఉంది, దేశవాళీ క్రికెట్‌లోను బాగా ఆడాడు. కానీ ప్రస్తుతం టెస్ట్ జట్టులో అతనికి స్థానం లేదు” అని ఆయన చెప్పారు. ఇది బహుశా అతను గత టెస్ట్ సిరీస్‌లలో అందించిన పరిమిత ప్రదర్శనల కారణంగా జరిగి ఉండవచ్చు. ఇంగ్లాండ్‌తో జరిగిన హోమ్ సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 106 పరుగులు మాత్రమే చేసి, 26 రన్స్ సగటుతో నిరాశపర్చిన అయ్యర్ ఆ తర్వాత టెస్ట్ జట్టు నుండి తప్పించబడ్డాడు.
అయితే ప్రస్తుతం అతను తిరిగి తన ఫామ్‌ను సాధించాడని, అతని ప్రదర్శనల వల్ల మళ్లీ టెస్ట్ జట్టులో చోటు కల్పించాల్సిన అవసరం ఉందని అభిమానులు భావిస్తున్నారు. గంభీర్ లాంటి వ్యక్తుల మద్దతు ఉండగా, శ్రేయాస్‌కు భవిష్యత్తులో తిరిగి భారత టెస్ట్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉండవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే, ఈ వివాదం మరోసారి సెలెక్షన్ ప్రక్రియపై ప్రశ్నలు తలెత్తించేలా చేస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..