
BCCI Guideline: 2024 సంవత్సరంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ను గెలుచుకుంది. ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టు సిరీస్ ఓటమితో భారత క్రికెట్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బీసీసీఐ మొదట టీమిండియా ఆటగాళ్లకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో కుటుంబ ప్రయాణాలపై పరిమితి విధించారు. అంతే కాదు దేశవాళీ క్రికెట్ ఇకపై ప్రతీ ఆటగాడికి తప్పనిసరి అయిపోయింది. ఇటువంటి పరిస్థితిలో ఆటగాల్లు ఈ రూల్స్ పాటించకపోతే, ఎలాంటి చర్చలు తీసుకుంటారో తాజాగా బయటకు వచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
బీసీసీఐ మార్గదర్శకాలలో, దేశవాళీ క్రికెట్, కుటుంబ సభ్యుల ప్రయాణంపై ఆంక్షలు విధించారు. ప్రాక్టీస్ సెషన్‌ల కోసం జట్టుతో కలిసి రావడంపైనా ఆంక్షలు పెట్టారు. ఇకపై ప్రతి సీనియర్ లేదా జూనియర్ ఆటగాడు దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కోరుతోంది. అయితే ఒక ఆటగాడి కుటుంబం అతనితో రెండు వారాల పాటు పర్యటనలో ఉండవచ్చు. ఇందులో బీసీసీఐ వసతికి మాత్రమే చెల్లిస్తుంది, మిగిలిన ఖర్చులను ఆటగాళ్లే స్వయంగా భరించాల్సి ఉంటుంది.
అదే సమయంలో, ప్రాక్టీస్ సెషన్‌లో టీమ్ ఇండియాలోని ప్రతి ఆటగాడు హాజరు కావాలని బీసీసీఐ కోరింది. జట్టుతో కలిసి ఒక వేదిక నుంచి మరొక వేదికకు వెళ్లవలసి ఉంటుంది. కాగా, టీమ్‌తో కలిసి ఉండటం వంటి వాటిపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఏ సిరీస్ లేదా టూర్ సమయంలో ప్లేయర్‌లు ఇకపై ప్రకటనలను షూట్ చేయలేరు.
ఈ విధంగా, ఒక ఆటగాడు బీసీసీఐ మార్గదర్శకాలలో చేర్చిన ఏ అంశంమైనా అనుసరించలేకపోతే, సదరు ఆటగాడు సెలక్షన్ కమిటీ ఛైర్మన్, ప్రధాన కోచ్ నుంచి అనుమతి తీసుకోవలసి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఎవరైనా ఆటగాడు తప్పు చేసి పట్టుబడితే అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చు.
ఒక ఆటగాడు ఈ విధానాలను సరిగ్గా అనుసరించకపోతే, టోర్నమెంట్‌లు, సిరీస్‌లు, ఐపీఎల్‌లో కూడా ఆడటానికి బోర్డు అతన్ని అనుమతించదు. ఇది కాకుండా, బోర్డు ఆటగాళ్ల జీతాలు, ఒప్పందాలపైనా భారీ ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందంట.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..