కోహ్లీ వికెట్ నాదే: మొయిన్‌ అలీ

ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీని ఔట్‌ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆతిథ్య జట్టు బౌలర్‌ మొయిన్‌ అలీ అన్నాడు. ఓ ఆంగ్ల మీడియా బ్లాగులో అలీ ఇలా పేర్కొన్నాడు ‘భారత జట్టుకు పరుగులు తీసేందుకే తాను ఉన్నానని కోహ్లీకి తెలుసు. అతడిని ఔట్‌ చేసేందుకు నేనున్నా. అలాంటి గొప్ప ఆటగాడిని ఔట్‌ చేయడం అంత సులువైన విషయం కాదు. అయినా మేమిద్దరం స్నేహితులమే. స్వదేశంలో ఆడటం ఒత్తిడికి కారణంగా మారొద్దు. […]

కోహ్లీ వికెట్ నాదే: మొయిన్‌ అలీ

Edited By:

Updated on: Jun 29, 2019 | 5:56 PM

ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీని ఔట్‌ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆతిథ్య జట్టు బౌలర్‌ మొయిన్‌ అలీ అన్నాడు. ఓ ఆంగ్ల మీడియా బ్లాగులో అలీ ఇలా పేర్కొన్నాడు ‘భారత జట్టుకు పరుగులు తీసేందుకే తాను ఉన్నానని కోహ్లీకి తెలుసు. అతడిని ఔట్‌ చేసేందుకు నేనున్నా. అలాంటి గొప్ప ఆటగాడిని ఔట్‌ చేయడం అంత సులువైన విషయం కాదు. అయినా మేమిద్దరం స్నేహితులమే. స్వదేశంలో ఆడటం ఒత్తిడికి కారణంగా మారొద్దు. తదుపరి మ్యాచ్‌ భారత్‌తో ఆడబోతున్నాం. వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుపై ఉన్నంత ఒత్తిడి మాపై ఉండదు’ అని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో మంచి ఫామ్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ వరుసగా నాలుగు అర్ధశతకాలు సాధించాడు. గతంలో అలీ.. కోహ్లీని మొత్తం అన్ని ఫార్మాట్లలో కలిపి ఆరుసార్లు ఔట్‌చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా రేపు జరగబోయే మ్యాచ్‌ రసవత్తరంగా మారే అవకాశం ఉంది.