2023 World Cup: వన్డే ప్రపంచకప్‌ను ఆడేందుకు ప్రారంభించిన వన్డే సూపర్ లీగ్‌ను ముగించాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ సూపర్ లీగ్ 2023 ప్రపంచ కప్ (2023 World Cup) తర్వాత భారతదేశంలో నిర్వహించరు. ఇలాంటి పరిస్థితుల్లో 2027లో జరిగే ప్రపంచకప్‌కు ర్యాంకింగ్ ఆధారంగా జట్లను ఎంపిక చేయనున్నారు. 2023 ప్రపంచకప్ కోసం ఐసీసీ వన్డే సూపర్ లీగ్‌ను ప్రారంభించింది. ఈ టోర్నీలో కేవలం 10 జట్లు మాత్రమే పాల్గొనాల్సి ఉంది. వీరిలో తొమ్మిది టీంలను సూపర్ లీగ్‌లో వారి ర్యాంకింగ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరోవైపు, ఆతిథ్య భారత్‌కు నేరుగా చోటు దక్కనుంది. ప్రస్తుతం వన్డే సూపర్ లీగ్‌లో 13 జట్లు ఉన్నాయి. వీటిలో 12 పూర్తికాల దేశాలు కాగా, ఒకటి నెదర్లాండ్స్‌కు చెందిన జట్టు. 2023 ప్రపంచకప్‌లో చేరేందుకు ప్రతీ జట్టు మొత్తం ఎనిమిది సిరీస్‌లు ఆడాలి, ఇందులో కనీసం మూడు మ్యాచులు ఉండేలా చూసుకోవాలి. ఎనిమిది సిరీస్‌లలో నాలుగు విదేశాల్లో, నాలుగు సొంతగడ్డపై జరుగేలా చూసుకోవాలి.
2023 ప్రపంచకప్ తర్వాత సూపర్ లీగ్ కాన్సెప్ట్ ముగుస్తుంది. ఐసీసీ బోర్డు ఇప్పటికే ఈ ప్రక్రియను ఆమోదించింది. దీనితో పాటు, 10 జట్లకు బదులుగా 14 జట్ల ప్రపంచకప్‌ను కొనసాగించడానికి కూడా ఆమోదించింది. దీని కింద 2027 ప్రపంచకప్‌లో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. వీరిలో 10 టీంలు ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకుంటారు. టాప్-10 ర్యాంకింగ్ కోసం కటాఫ్ తేదీ నిర్ణయిస్తారు. అదే సమయంలో, నాలుగు జట్లు క్వాలిఫయర్స్ ద్వారా ప్రవేశిస్తాయి. ఇందుకోసం గ్లోబల్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడనున్నారు. 2027 ప్రపంచకప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరగనుంది.
సూపర్ లీగ్ జులై 2020లో ప్రారంభమైంది..
ఐసీసీ జులై 2020లో వన్డే సూపర్ లీగ్‌ని ప్రారంభించింది. అయితే దీనికి ముగింపు పలకాలనే చర్చ గత కొన్ని నెలలుగా సాగుతోంది. వాస్తవానికి, అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ చాలా బిజీగా ఉంది. సూపర్ లీగ్‌కు చోటు కల్పించడంలో బోర్డులు చాలా సమస్యలను ఎదుర్కొన్నాయి. దీంతో పాటు ద్వైపాక్షిక సిరీస్ కింద జరగాల్సిన వన్డే సిరీస్ మ్యాచ్‌ల సంఖ్యను కూడా ఐదు నుంచి మూడుకు తగ్గించారు. దీని వల్ల కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇంతలో ఐసీసీ 2024 టీ20 ప్రపంచ కప్ ఆతిథ్యాన్ని వెస్టిండీస్, అమెరికాకు అందించింది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. ఈ జట్లు నాలుగు గ్రూపులుగా ఆడనుండగా, టోర్నీలో మొత్తం 55 మ్యాచ్‌లు జరుగుతాయి. 2024 టీ20 ప్రపంచ కప్ జూన్ 2024లో జరుగుతుంది. 25 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో అమెరికాలో 20 మ్యాచ్‌లు, వెస్టిండీస్‌లో 35 మ్యాచ్‌లు జరగనున్నాయి. అమెరికాలో తొలిసారిగా ఐసీసీ ఈవెంట్ జరుగుతోంది.
Deepak Chahar: ఒక్క చూపుతో లక్ష రూపాయలు గెలిచాడు.. అదేలాగంటారా..