ICC T20 Team Of The Year: భారత ఆటగాళ్లకు అవమానం.. ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్టులో నో ప్లేస్..!

|

Jan 19, 2022 | 8:00 PM

2021లో అత్యుత్తమ టీ20 జట్టును ఐసీసీ ప్రకటించింది. ఈ జట్టులో భారత ఆటగాళ్లకు ఒక్కరికి కూడా చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ICC T20 Team Of The Year: భారత ఆటగాళ్లకు అవమానం.. ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్టులో నో ప్లేస్..!
Team India
Follow us on

ICC T20 Team Of The Year: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2021 సంవత్సరంలో అత్యుత్తమ T20I జట్టును ప్రకటించింది. అయితే ఇందులో ఒక్క భారత ఆటగాడికి కూడా చోటు కల్పించకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. 2021 అత్యుత్తమ టీ20 జట్టులో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా నుంచి ముగ్గురు చొప్పున, ఆస్ట్రేలియా తరపున ఇద్దరు, ఇంగ్లండ్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల నుంచి ఒక్కో ఆటగాడు ఉన్నాడు.

కెప్టెన్‌గా పాకిస్తాన్ ప్లేయర్..
ఈ జట్టు కెప్టెన్సీ పగ్గాలను పాకిస్థాన్‌కు చెందిన బాబర్ అజామ్‌కు అప్పగించింది. ఈ జట్టులో బాబర్‌తో పాటు పాకిస్థాన్ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్, ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది కూడా ఉన్నారు. అదే సమయంలో, దక్షిణాఫ్రికాకు చెందిన ఐడాన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, తబ్రేజ్ షమ్సీ కూడా ఈ జట్టులో చొటు దక్కించుకున్నారు.

అదే సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ మార్ష్, జోష్ హెజ్లువాడ్‌లకు ఐసీసీ ఈ జట్టులో చోటు కల్పించింది. దీంతో పాటు బంగ్లాదేశ్‌కు చెందిన ముస్తాఫిజుర్ రెహమాన్, శ్రీలంకకు చెందిన వనిందు హసరంగా, ఇంగ్లండ్‌కు చెందిన తుఫాన్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ ఈ జట్టులో ఉన్నారు.

ఐసీసీ 2021 ఉత్తమ టీ20 జట్టు – జోస్ బట్లర్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజం (కెప్టెన్), ఐదాన్ మార్క్‌రామ్, మిచెల్ మార్ష్, డేవిడ్ మిల్లర్, వనిందు హసరంగా, తబ్రేజ్ షమ్సీ, జోష్ హజ్లెవుజ్, ముస్తాఫిజుర్ రహ్మాన్ మరియు ముస్తాఫిజుర్ రహ్మాన్.

Also Read: MS Dhoni: ఆన్‌లైన్ వేలంలో వింటేజ్‌ కారు కొనుగోలు చేసిన ధోనీ.. ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

IND Vs SA: దంచికొట్టిన బావుమా, డస్సెన్‌లు.. బిత్తరపోయిన భారత బౌలర్లు.. భారత టార్గెట్‌ 297 పరుగులు