Ind Vs Pak: క్రికెట్ రెండు దేశాల మధ్య సంబంధాలను పెంచుతుంది.. ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే..

|

Nov 23, 2021 | 7:17 AM

భారత్‌లో ఉగ్రదాడుల తర్వాత దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా 2012 నుంచి భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ జరగలేదు. అయితే పాకిస్తాన్‎లో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్ పాల్గొనడం సందేహంగానే ఉంది...

Ind Vs Pak: క్రికెట్ రెండు దేశాల మధ్య సంబంధాలను పెంచుతుంది.. ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే..
Ind Vs Pak
Follow us on

భారత్‌లో ఉగ్రదాడుల తర్వాత దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా 2012 నుంచి భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ జరగలేదు. అయితే పాకిస్తాన్‎లో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో భారత్ పాల్గొనడం సందేహంగానే ఉంది. పొరుగు దేశంలో పర్యటించేందుకు అంతర్జాతీయ జట్లకు భద్రతాపరమైన సమస్యలు ఉన్నందున ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనడంపై సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటామని క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ గత వారం చెప్పారు. క్రికెట్ రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలలో మెరుగుపరుస్తుందని ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే అన్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్తాన్‌కు వెళ్లే జట్లకు రిజర్వేషన్లు ఉంటాయని విశ్వసిస్తున్నట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సోమవారం తెలిపింది. 1996 ప్రపంచ కప్‌కు భారత్, శ్రీలంకతో కలిసి ఆతిథ్యమిచ్చినప్పుడు పాకిస్తాన్ చివరిసారిగా తన గడ్డపై ICC ఈవెంట్‌ను నిర్వహించింది. 2009లో లాహోర్‌లో శ్రీలంక జట్టు బస్సుపై ఉగ్రవాదుల దాడి తర్వాత దేశంలో అనేక అంతర్జాతీయ ఆటలకు ఆతిథ్యం ఇవ్వలేకపోయింది. సెప్టెంబరులో ఇంగ్లండ్, న్యూజిలాండ్ భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్ పర్యటనల నుండి వైదొలిగాయి.

ఈవెంట్ విజయవంతంగా జరుగుతుందనే నమ్మకం లేకుంటే, పాలకమండలి పాకిస్తాన్‌కు ఆతిథ్య హక్కులను ఇచ్చేది కాదని బార్క్లే నొక్కి చెప్పారు. “కాబట్టి, పాకిస్తాన్‌కు ఆతిథ్యమివ్వగల సామర్థ్యం లేదని మేము భావించి ఉంటే మేము ఈ ఈవెంట్‌ను ప్రదానం చేసి ఉండేవాళ్లం కాదు. ఇది ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాం.” అని అన్నాడు.

Read Also.. రోహిత్‌ శర్మ పని పూర్తయింది.. కానీ విరాట్‌ కోహ్లీ, రహానే పని మిగిలే ఉంది.. ఏంటో తెలుసా..?