
ICC ODI World Cup 2023: ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 1975లో ప్రారంభమైనప్పటి నుంచి అనేక జట్లు తమ అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శనలను ప్రదర్శిస్తూనే ఉన్నాయి. అయితే, తాజాగా ఢిల్లీలో జరుగుతోన్న సౌతాఫ్రికా వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 3 భారీ రికార్డులు నమోదయ్యాయి.
ఢిల్లీలో జరిగిన ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లో భాగంగా శ్రీలంకపై ఐదు వికెట్ల నష్టానికి 428 పరుగుల భారీ స్కోరుతో సౌతాఫ్రికా చరిత్ర సృష్టించింది. 2015లో ఆస్ట్రేలియా నెలకొల్పిన రికార్డును దక్షిణాఫ్రికా బద్దలుకొట్టింది. ప్రోటీస్ జట్టులో ముగ్గురు ప్లేయర్లు సెంచరీలు నమోదు చేయండి మరో రికార్డుగా నిలిచింది. అలాగే ఇక మూడో రికార్డ్ గురించి మాట్లాడితే, సౌతాఫ్రికా జట్టు 3 సార్లు 400-ప్లస్ మొత్తాలను నమోదు చేసిన తొలి జట్టుగా అవతరించింది.
ICC ODI ప్రపంచ కప్ 13 వ ఎడిషన్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారతదేశంలో జరగనుంది. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.
| జట్టు | స్కోర్ | ప్రత్యర్థి | గ్రౌండ్ | సంవత్సరం |
| సౌతాఫ్రికా | 428/5 (50) | శ్రీలంక | ఢిల్లీ | 2023 |
| ఆస్ట్రేలియా | 417/7 (50) | ఆఫ్ఘనిస్తాన్ | పెర్త్ | 2015 |
| భారతదేశం | 413/5 (50) | బెర్ముడా | పోర్ట్ ఆఫ్ స్పెయిన్ | 2007 |
| సౌతాఫ్రికా | 411/4 (50) | ఐర్లాండ్ | కాన్బెర్రా | 2015 |
| సౌతాఫ్రికా | 408/5 (50) | వెస్ట్ ఇండీస్ | సిడ్నీ | 2015 |
| శ్రీలంక | 398/5 (50) | కెన్యా | కాండీ | 1996 |
| ఇంగ్లండ్ | 397/6 (50) | ఆఫ్ఘనిస్తాన్ | మాంచెస్టర్ | 2019 |
| న్యూజిలాండ్ | 393/5 (50) | వెస్ట్ ఇండీస్ | వెల్లింగ్టన్ | 2015 |
| ఇంగ్లండ్ | 386/6 (50) | బంగ్లాదేశ్ | కార్డిఫ్ | 2019 |
| ఆస్ట్రేలియా | 381/5 (50) | బంగ్లాదేశ్ | నాటింగ్‌హామ్ | 2019 |
| ఆస్ట్రేలియా | 377/6 (50) | దక్షిణ ఆఫ్రికా | బస్సెటెర్రే | 2007 |
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ 11: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, గెరాల్ట్ కోయెట్జీ, లుంగి ఎన్గిడి.
శ్రీలంక ప్లేయింగ్ 11: దసున్ షనక (కెప్టెన్), కుసల్ పెరీరా, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ్ డి సిల్వా, దునిత్ వెల్లలాగే, మహిష్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..