T20 World Cup 2021: నేనూ అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను.. పాక్ క్రికెట్ జట్టుకు మద్దతుగా ఆ దేశ ప్రధాని ట్వీట్..

|

Nov 12, 2021 | 10:02 PM

దుబాయ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిన పాకిస్తాన్ జట్టుకు మద్దతు తెలుపుతూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం ట్వీట్ చేశారు. కెప్టెన్ బాబర్ ఆజం, అతని జట్టును ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్‌లో "క్రికెట్ ఫీల్డ్‌లో ఇలాంటి నిరాశను ఎదుర్కొన్నాను" అని రాశారు...

T20 World Cup 2021: నేనూ అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను.. పాక్ క్రికెట్ జట్టుకు మద్దతుగా ఆ దేశ ప్రధాని ట్వీట్..
Imran
Follow us on

దుబాయ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిన పాకిస్తాన్ జట్టుకు మద్దతు తెలుపుతూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం ట్వీట్ చేశారు. కెప్టెన్ బాబర్ ఆజం, అతని జట్టును ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్‌లో “క్రికెట్ ఫీల్డ్‌లో ఇలాంటి నిరాశను ఎదుర్కొన్నాను” అని రాశారు. సూపర్ 12 దశలో ఆడిన ఐదు గేమ్‌ల్లోనూ గెలిచిన పాకిస్తాన్, గురువారం జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. “బాబర్ ఆజం అండ్ టీమ్‌కి: క్రికెట్ మైదానంలో నేను ఇలాంటి నిరుత్సాహాలను ఎదుర్కొన్నందున మీరందరూ ప్రస్తుతం ఎలా ఫీలవుతున్నారో నాకు తెలుసు. కానీ మీరు ఆడిన క్రికెట్ నాణ్యత, మీలో మీరు చూపిన వినయం గురించి మీరందరూ గర్వపడాలి. గెలుపొందిన ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు,” అని చెప్పాడు.

గురువారం మ్యాచ్‎లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో మొత్తం 176/4 చేసింది. మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్ ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో పాకిస్తాన్ మంచి స్కోరు చేసింది. 177 పరుగులు విజయలక్షంతో బ్యాటింగ్‎కు దిగిన ఆస్ట్రేలియా12.2 ఓవర్లలో 96 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. అయితే, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ కలిసి ఆసీస్‌ను మరో ఓవర్ మిగిలి ఉండగానే విజయతీరాలకు చేర్చారు. వేడ్ అజేయంగా 17 బంతుల్లో 41 పరుగులు చేయగా, స్టోయినిస్ 31 బంతుల్లో 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 19వ ఓవర్‌లో షాహీన్ ఆఫ్రిది బౌలింగ్‎లో వేడ్ వరుసగా మూడు సిక్సర్లు బాది పాకిస్తాన్ టైటిల్ ఆశలపై నీళ్లు చల్లాడు.

Read Also..

T20 World Cup 2021: డేవిడ్ వార్నర్ సిక్స్‎పై విమర్శలు.. సరైన పద్ధతి కాదని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలు..