Harry Brook Auction Price: ఇంగ్లండ్ యువ ప్లేయర్ కోసం అన్ని జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. రూ.1.50 కోట్లతో లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ప్లేయర్ కోసం బెంగళూర్, రాజస్థాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంలు చివరిదాకా పోటీపడ్డాయి. చివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం రూ.13.25 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఈ ఇంగ్లండ్ యువ సంచలనం ఐపీఎల్ అరంగేట్రంలోనే బేస్ ప్రైజ్ కంటే దాదాపు 9 రెట్లు ఎక్కువగా దక్కించుకున్నాడు. అన్ని ఫ్రాంచైజీల తరపున ఈ యువ సంచలనం 99 మ్యాచులు ఆడి 2432 పరుగులు చేశాడు. 140పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టాడు.
హ్యారీ బ్రూక్ కోసం సన్‌రైజర్స్, రాజస్థాన్ మధ్య గట్టి పోరు నెలకొంది. రాజస్థాన్ పర్సులో కేవలం రూ. 13 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే, బ్రూక్ కోసం మొత్తం 13 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. కానీ, సన్‌రైజర్స్ 13.25 కోట్లకు వేలం వేసి రాజస్థాన్‌ను రేసు నుంచి తప్పించి బ్రూక్‌ను తన జట్టులో చేర్చుకుంది.