లైఫ్ ఇచ్చిన రింకూ.. కట్‌చేస్తే.. సెంచరీతో మనోడే మన బౌలర్ల తాట తీసేశాడుగా..

Harpreet Singh Bhatia Century vs India A: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో UAE బ్యాటర్ హర్‌ప్రీత్ సింగ్ భాటియా చెలరేగాడు. ఇండియా Aపై 120 బంతుల్లో సెంచరీ బాది జట్టును ఆదుకున్నాడు. రింకు సింగ్ క్రీడాస్ఫూర్తితో వదిలిన క్యాచ్‌నే శతకంగా మార్చి భారత బౌలర్లకు షాక్ ఇచ్చాడు.

లైఫ్ ఇచ్చిన రింకూ.. కట్‌చేస్తే.. సెంచరీతో మనోడే మన బౌలర్ల తాట తీసేశాడుగా..
Harpreet Singh Bhatia Century Vs India A

Updated on: Nov 24, 2026 | 2:56 PM

Harpreet Singh Bhatia Century vs India A: ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భాగంగా జరుగుతున్న 11వ మ్యాచ్, గ్రూప్-బిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దోహాలోని యూనివర్సిటీ ఆఫ్ దోహా ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో యూఏఈ స్టార్ హర్‌ప్రీత్ సింగ్ భాటియా సెంచరీతో మెరిశాడు.

120 బంతుల్లో సెంచరీ..

తనదైన స్టైల్‌లో ల్యాండ్‌మార్క్‌ను అందుకున్నాడు. అతడి ప్రయత్నానికి జట్టు మొత్తం లేచి నిలబడి చప్పట్లు కొట్టింది. స్కోరింగ్ రేట్‌ను పెంచుతూ యూఏఈకు మ్యాచ్ విన్నింగ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు అందించే దిశగా సాగుతున్నాడు. 50 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

ఎక్కువమంది చదివినది: IND vs PAK: తిలక్ కాదు.. టీమిండియా ఓటమికి ఈ ముగ్గురు అసలైన విలన్లు..!

ఇవి కూడా చదవండి

39.4వ ఓవర్‌లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో సిక్స్‌తోనే సెంచరీకి చేరడం విశేషం. హెల్మెట్ తీసి రెండు చేతులు పైకెత్తి సంబరాలు చేసుకున్నాడు. పేస్ తగ్గించి మిడిల్‌పై వేసిన ఫుల్ బంతిని ముందు కాలు పక్కకు తీసి లాంగ్-ఆన్ ఫెన్స్ మీదుగా భారీ సిక్స్‌గా మలిచి మైలురాయిని అందుకున్నాడు.

ఈ కథనం అందే సమయానికి UAE 40.2 ఓవర్లలో 184/5 స్కోరుతో ఉంది. హర్‌ప్రీత్ 122 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 103 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడికి కెప్టెన్ బాసిల్ హమీద్ (12 బంతుల్లో 10) తోడుగా ఉన్నాడు.

స్కోర్ వివరాలు:

ఆర్యాన్ష్ శర్మ 2, అన్ష్ టాండన్ 8, మహమ్మద్ షాదాద్ 28, ఈథన్ డిసౌజా 25, ఎం అఫ్తాబ్ ఆలం 2 పరుగులు చేసి అవుటయ్యారు.

ఎక్కువమంది చదివినది: భారత జట్టులో అతను వేస్ట్.. పీకిపారేయండి.. ఈ ఇద్దరిలో ఒకడు ఉంటే తొలి టెస్ట్ గెలిచేవాళ్లం..

రింకు లైఫ్‌తో శతకంగా..

ఈ సెంచరీ వెనుక ఆసక్తికర కథ ఉంది. 35 బంతుల్లో 26 పరుగుల వద్ద ఉన్నప్పుడు మిడ్-ఆఫ్‌లో రింకు సింగ్ డైవ్ చేసి క్యాచ్ పట్టినా బంతి కింద పడిందని స్వయంగా అంపైర్‌కు చెప్పి నాటౌట్‌గా వదిలేశాడు. ఆ క్రీడాస్ఫూర్తి జీవనదానాన్ని హర్‌ప్రీత్ సద్వినియోగం చేసుకుని ఇప్పుడు సెంచరీగా మార్చి ఇండియా ఏను దెబ్బతీశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us