Hardik Pandya : గంభీర్ సార్.. ఈమె మహికా.. తన గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన హార్దిక్

Hardik Pandya : హార్దిక్ పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మను కోచ్ గౌతమ్ గంభీర్‌కు పరిచయం చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కోసం టీమ్ ఇండియా అహ్మదాబాద్ చేరుకున్న వేళ ఈ దృశ్యం కనిపించింది.

Hardik Pandya  : గంభీర్ సార్.. ఈమె మహికా.. తన గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన హార్దిక్
Hardik Pandya

Updated on: Mar 07, 2026 | 2:27 PM

Hardik Pandya : టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఫీవర్ దేశమంతటా ఊపేస్తోంది. రేపు (మార్చి 8, ఆదివారం) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తుది పోరు జరగనుంది. ఈ కీలక మ్యాచ్ కోసం టీమిండియా శుక్రవారమే అహ్మదాబాద్ చేరుకుంది. అయితే మైదానంలో ఆటగాళ్ల ప్రాక్టీస్ కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పాండ్యా తన ప్రియురాలు మహికా శర్మను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు పరిచయం చేస్తూ కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది.

గంభీర్‌కు గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన హార్దిక్

ఎయిర్‎పోర్టు నుంచి టీమ్ హోటల్‌కు చేరుకున్న సమయంలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. హార్దిక్ తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మను పిలిచి కోచ్ గౌతమ్ గంభీర్‌కు పరిచయం చేశాడు. గంభీర్ కూడా చాలా కూల్‌గా మహికాతో కరచాలనం చేసి, చిరునవ్వుతో పలకరించారు. సాధారణంగా చాలా సీరియస్‌గా ఉండే గంభీర్, ఈ పరిచయం వేళ నవ్వుతూ కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కూడా మహికా స్టాండ్స్‌లో కూర్చుని హార్దిక్ కోసం ఛీర్ చేస్తూ కనిపించింది. ఆమెతో పాటు హార్దిక్ కుమారుడు అగస్త్య కూడా ఉండటం విశేషం.

నటాషా స్టాంకోవిచ్‌తో విడిపోయాక కొత్త ప్రేమ

హార్దిక్ పాండ్యా తన భార్య, సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిచ్‌తో జూలై 2024లో విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కుమారుడు అగస్త్యను ఇద్దరూ కలిసి చూసుకుంటున్నారు (కో-పేరెంటింగ్). అయితే గత కొన్ని నెలలుగా హార్దిక్, మహికా శర్మతో ప్రేమలో ఉన్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా టీమ్ కోచ్‌కే ఆమెను పరిచయం చేయడంతో వారి బంధంపై వస్తున్న వార్తలకు బలం చేకూరినట్లయింది. గర్ల్‌ఫ్రెండ్ అండతో హార్దిక్ మైదానంలో మరింత ఉత్సాహంగా ఆడుతున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

వరల్డ్ కప్‌లో హార్దిక్ ఊచకోత

వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా, మైదానంలో మాత్రం హార్దిక్ పాండ్యా పక్కా ప్రొఫెషనల్‌గా రాణిస్తున్నాడు. సెమీఫైనల్ వరకు ఆడిన 8 ఇన్నింగ్స్‌ల్లో 163.11 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 199 పరుగులు చేశాడు. ఇందులో రెండు మెరుపు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కేవలం బ్యాటింగ్‌తోనే కాదు, బౌలింగ్‌లోనూ 8 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 27 పరుగులు చేయడంతో పాటు 2 కీలక వికెట్లు తీసి టీమిండియాను ఫైనల్‌కు చేర్చాడు. కివీస్‌తో జరిగే ఫైనల్లో కూడా పాండ్యా ఇదే జోరు కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us