
Hardik Pandya : టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, బయట కూడా అంతే వార్తల్లో ఉంటాడు. తాజాగా హార్దిక్ తన స్నేహితురాలు మహికా శర్మతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి ఒక రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ నుంచి బయటకు వస్తుండగా ఒక అభిమాని చేసిన వెర్రి పని ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. సెల్ఫీ ఇవ్వలేదన్న కోపంతో ఒక వ్యక్తి హార్దిక్‌ను ఉద్దేశించి అత్యంత దారుణంగా భాడ్ మే జా(నరకానికి పో) అంటూ నోరు పారేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
రెస్టారెంట్ బయట హార్దిక్ పాండ్యాను చూడటానికి పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. హార్దిక్ తన సెక్యూరిటీ మధ్యలో నడుచుకుంటూ వచ్చి, ముందుగా మాహికా శర్మను సురక్షితంగా కారులో కూర్చోబెట్టాడు. ఆ తర్వాత కొంతమంది అభిమానులకు సెల్ఫీలు ఇచ్చాడు. అయితే రద్దీ ఎక్కువగా ఉండటంతో ఒక వ్యక్తికి సెల్ఫీ తీసుకునే అవకాశం దక్కలేదు. దీంతో ఆ వ్యక్తి అసహనానికి లోనై, హార్దిక్ కారు ఎక్కుతుండగా వెనుక నుంచి గట్టిగా తిట్టాడు. అయితే ఈ అవమానాన్ని హార్దిక్ అస్సలు పట్టించుకోకపోవడం గమనార్హం.
𝗚𝘂𝘆𝘀, 𝘁𝗵𝗶𝘀 𝗶𝘀 𝗴𝗲𝘁𝘁𝗶𝗻𝗴 𝗧𝗢𝗢 𝗠𝗨𝗖𝗛 🤬🙏
A fan tried to approach Hardik Pandya for a selfie but couldn’t get close.
𝗙𝗮𝗻: 𝗕𝗛𝗔𝗔𝗗 𝗠𝗘 𝗝𝗔𝗢 (Go to Hell) 😡
𝗛𝗮𝗿𝗱𝗶𝗸: Either didn’t hear it, or heard it and chose to ignore.
This incident happened… pic.twitter.com/B929w11Iwi
— Jara (@JARA_Memer) December 25, 2025
ఈ మాట విన్నప్పటికీ హార్దిక్ పాండ్యా వెనక్కి తిరిగి చూడలేదు సరే కదా, కనీసం ముఖంలో అసహనం కూడా ప్రదర్శించలేదు. చాలా ప్రశాంతంగా కారు ఎక్కి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అది హార్దిక్ కు వినిపించలేదా లేక విన్నా కూడా కావాలనే ఇగ్నోర్ చేశారా అనేది పక్కన పెడితే.. అతను ప్రదర్శించిన సహనానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఆ తిట్టిన వ్యక్తిని నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. “సెలబ్రిటీలు కూడా మనుషులే, వారికి ప్రైవసీ ఉంటుంది.. ఇలా ప్రవర్తించడం సభ్యత కాదు” అంటూ హార్దిక్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.
వ్యక్తిగత విషయాలు పక్కన పెడితే, హార్దిక్ ప్రస్తుతం కెరీర్ పరంగా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో కేవలం 3 ఇన్నింగ్స్‌ల్లోనే 142 పరుగులు చేసి అదరగొట్టాడు. ఒక మ్యాచ్‌లో కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది, టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో భారత్ తరపున రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బౌలింగ్‌లోనూ 3 వికెట్లు తీసి తన ఆల్‌రౌండ్ సత్తాను చాటాడు. మైదానంలో సిక్సర్లతో విరుచుకుపడే హార్దిక్, బయట ఇంతటి సంయమనం పాటించడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..