GT vs PBKS, IPL 2024: సీజన్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్.. లిస్టులో నలుగురు మనోళ్లే..

Shubman Gill: గురువారం నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు చెందిన శుభ్‌మన్ గిల్ 48 బంతుల్లో అజేయంగా 89 పరుగులు చేశాడు. ఈ ఐపీఎల్ ఎడిషన్‌లో ఇప్పటివరకు ఓ ప్లేయర్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే కావడం గమనార్హం.

GT vs PBKS, IPL 2024: సీజన్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్.. లిస్టులో నలుగురు మనోళ్లే..
Shubman Gill

Updated on: Apr 05, 2024 | 10:13 PM

Shubman Gill: గురువారం నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు చెందిన శుభ్‌మన్ గిల్ 48 బంతుల్లో అజేయంగా 89 పరుగులు చేశాడు. ఈ ఐపీఎల్ ఎడిషన్‌లో ఇప్పటివరకు ఓ ప్లేయర్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే కావడం గమనార్హం. ఐపీఎల్ 2024 17వ మ్యాచ్‌లో గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్‌కు గుజరాత్ టైటాన్స్ 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

అనంతరం శశాంక్ సింగ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇది ఫ్రాంచైజీకి ఎప్పుడూ గుర్తుండే ఉంటుంది. ఈ ఆటగాడు గుజరాత్ టైటాన్స్ విజయాన్ని లాగేసుకున్నాడు. 29 బంతుల్లో 61 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్‌కు 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. 89 పరుగుల శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ వృథాగా మార్చేశాడు. కానీ శశాంక్, ప్రభ్‌సిమ్రన్, అశుతోష్ శర్మల తుపాన్ ఇన్నింగ్స్‌తో జట్టు 1 బంతి మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.

కాగా, గుజరాత్ టైటాన్స్ సారథి శుభ్మన్ గిల్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అత్యధిక స్కోర్ నమోదు చేసినా.. తన జట్టును గెలిపించలేకపోయాడు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ల జాబితాను ఓసారి చూద్దాం..

IPL 2024లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..

1) శుభమన్ గిల్ – 89 (48 బంతులు)

2) సునీల్ నరైన్ – 85 (39 బంతులు)

3) రియాన్ పరాగ్ – 84* (45 బంతులు)

4) విరాట్ కోహ్లీ – 83* (59 బంతులు)

5) సంజు శాంసన్ – 82* (52 బంతులు)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..