Goat Theft: పండుగ వేళ స్టార్ క్రికెటర్‌కు షాక్.. అర్థరాత్రి మేకను ఎత్తుకెళ్లిన దుండగలు..!

|

Jul 09, 2022 | 10:36 PM

Goat Theft: పాకిస్థాన్ ఎప్పుడూ వింత ఘటనతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. బక్రీద్ పండుగ పర్వదినం సందర్భంగా దాయాది దేశమైన పాకిస్తాన్‌‌లో

Goat Theft: పండుగ వేళ స్టార్ క్రికెటర్‌కు షాక్.. అర్థరాత్రి మేకను ఎత్తుకెళ్లిన దుండగలు..!
Goat
Follow us on

Goat Theft: పాకిస్థాన్ ఎప్పుడూ వింత ఘటనతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. బక్రీద్ పండుగ పర్వదినం సందర్భంగా దాయాది దేశమైన పాకిస్తాన్‌‌లో సందడి నెలకొంది. బక్రీద్ పర్వదినాన గొర్రెలు, మేకలను బలి ఇస్తారు. అయితే, ఇందులో భాగంగానే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ కూడా ఓ మేక ను కొన్నాడు. బక్రీద్ వేళ దానిని బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉంచాడు. అయితే, ఆ మేకపై ఎవరి కన్ను పడిందో ఏమో గానీ.. రాత్రి రాత్రే ఆ మేకను ఎత్తుకెళ్లారు దుండగులు. ఇప్పుడి హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది కమ్రాన్ అక్మల్ ఇంట్లో ఆరు మేకలను బలి ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. అందుకోసం ఆరు మేకలను తీసుకురాగా.. అందులో ఒకదానిని దుండగులు ఎత్తుకెళ్లారు. భారీ సెక్యూరిటీ ఉండే ఏరియాలోని కమ్యూనిటీ గెటెడ్ హౌసింగ్ సొసైటీలో ఈ చోరీ జరగడం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. అయితే, ఈ చోరీపై స్పందించిన హౌసింగ్ సొసైటీ వారు.. దుండగులను కనిపెట్టి దొంగిలించిన మేకను పట్టుకుంటామని చెబుతున్నారు. కాగా, ఈ వార్త ఇప్పుడు పాకిస్తాన్‌‌లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగానూ హైలెట్ అయ్యింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..