క్రికెట్ మైదానంలో ఒకటి కంటే ఎక్కువ అద్భుతమైన క్యాచ్‌లను ఇప్పటికే చూసి ఉంటారు. ప్రతి క్యాచ్‌లో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. వాటిలో చాలా క్యాచ్‌లు మిమ్మల్ని కూడా థ్రిల్‌కి గురి చేసి ఉంటాయి. అయితే తాజాగా ఓ క్యాచ్‌కి సంబంధించిన వీడియో.. నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. ఈ క్యాచ్ మీరు చూసిన అన్ని మునుపటి క్యాచ్‌లను పక్కకు నెట్టేస్తుంది. ఇప్పుడు క్రికెట్ అత్యున్నత సంస్థ ఐసీసీ కూడా ఈ క్యాచ్‌ను పొగడ్తలతో ముంచేసింది.
ఈ క్యాచ్‌లో అంత ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం.. అంటే ఆ క్యాచ్ పట్టిన ఆటగాడి చురుకుదనం చూస్తే.. చిరుత కూడా పరేషాన్ అయ్యేలా ఉంది. అలాగే జాంటీ రోడ్స్ లానే ఫీల్డ్‌లో చురుకుగా వ్యవహరించి, ఆకట్టుకున్నాడు. దీంతో అంతా ఆయన తమ్ముడిలా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. బంతి నేలకు తాకే ముందు వేగంగా స్పందించి, అద్భుతంగా పట్టుకున్నాడు.
11 ఆగస్టు 2022న ఇటలీ vs హాంకాంగ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సీన్ కనిపించింది. క్యాచ్ పట్టిన ఆటగాడు ఇటలీకి చెందిన జియాన్ పియరో మీడ్ కాగా, ఈ క్యాచ్‌లో హాంకాంగ్ బ్యాట్స్‌మెన్ ఎహ్సాన్ ఖాన్ అవుటయ్యాడు.
చిరుతలా దూకి..
ఇటలీ బౌలర్ మనంటి వేసిన బంతిని ఎహ్సాన్ ఖాన్ షాట్ ఆడాడు. అతని బ్యాట్‌కు తగలడంతో బంతి నో మ్యాన్స్ ల్యాండ్‌లో పడింది. కానీ, అకస్మాత్తుగా జియాన్ పియరో గాలిలో ఎగురుతూ వచ్చి నేలను తాకే ముందు బంతిని చేత్తో అద్భుతంగా పట్టుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసి అందరూ అవాక్కయ్యారు. ఇక, తాజాగా ఐసీసీ కూడా ఈ క్యాచ్‌ను అసమానమైనదిగా పేర్కొంది.
హాంకాంగ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇటలీ 4 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత ఆడిన ఇటలీ 49.3 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటైంది. దీంతో హాంకాంగ్ జట్టు మొత్తం 49.1 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది.