ఐపీఎల్ 2026 విజేతగా పంజాబ్.. తొలి ట్రోఫీకి అదిరిపోయే స్కెచ్.. ప్లేయింగ్ 11తోనే పిచ్చెక్కిస్తున్నారుగా..

IPL 2026 కంటే ముందు పంజాబ్ కింగ్స్ అత్యధిక ఆటగాళ్లను, 21 మందిని నిలుపుకుంది. అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ జట్టు గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది. అందువల్ల, ఈ సీజన్‌లో కూడా జట్టులో పెద్దగా మార్పులు చేయకూడదనుకుంటున్నారు.

ఐపీఎల్ 2026 విజేతగా పంజాబ్.. తొలి ట్రోఫీకి అదిరిపోయే స్కెచ్.. ప్లేయింగ్ 11తోనే పిచ్చెక్కిస్తున్నారుగా..
Pbks

Updated on: Nov 25, 2025 | 8:30 AM

Punjab Playing XI: ఐపీఎల్ 2026 (IPL 2026) వేలంలోకి ప్రవేశించే ముందు, పంజాబ్ కింగ్స్ తమ చిరకాల ఆటగాళ్లపై ఎక్కువ నమ్మకం ఉంచింది. పంజాబ్ అత్యధిక ఆటగాళ్లను నిలుపుకుంది. 21 మందిలో ఆరుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. పంజాబ్ కింగ్స్ జట్టు నాలుగు ఖాళీ స్లాట్‌లతో వేలంలోకి ప్రవేశించనుంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ జట్టు ప్రాబబుల్ ప్లేయింగ్ XI ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం..

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ XI..

IPL 2026 కంటే ముందు పంజాబ్ కింగ్స్ అత్యధిక ఆటగాళ్లను, 21 మందిని నిలుపుకుంది. అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ జట్టు గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది. అందువల్ల, ఈ సీజన్‌లో కూడా జట్టులో పెద్దగా మార్పులు చేయకూడదనుకుంటున్నారు.

అయ్యర్ ఆధ్వర్యంలో బెస్ట్ సీజన్..

IPL 2025 కి ముందు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ గా నియమితులయ్యాడు. అయ్యర్ నాయకత్వంలో, జట్టు చాలా కాలం తర్వాత ఫైనల్స్ కు చేరుకుంది. పంజాబ్ తరపున అయ్యర్ కెప్టెన్సీలో అరంగేట్రం ఆకట్టుకుంది.

శశాంక్ కు కీలక బాధ్యత..

IPL 2026 కి ముందే శ్రేయాస్ అయ్యర్ కు ఒక భాగస్వామి దొరికాడు. శశాంక్ సింగ్ వైస్ కెప్టెన్ గా నియమితులయ్యారు. గత రెండు సీజన్లలో పంజాబ్ తరపున శశాంక్ అద్భుతమైన బ్యాట్స్ మాన్ గా ఉన్నాడు.

మొదటి టైటిల్ గెలవడానికి రంగం సిద్ధం..

పంజాబ్ కింగ్స్‌ను తొలి టైటిల్‌కు తీసుకెళ్లడం శ్రేయాస్ అయ్యర్ ముందున్న అతిపెద్ద సవాలు. తొలి సీజన్‌లో జట్టును ఫైనల్స్‌కు తీసుకెళ్లిన అయ్యర్‌పై జట్టు యాజమాన్యం భారీ ఆశలు పెట్టుకుంది.

విడుదల చేసిన ఆటగాళ్లు..

పంజాబ్ కింగ్స్ ఆరోన్ హార్డీ, కుల్దీప్ సేన్, ప్రవీణ్ దూబేలతో పాటు గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్ వంటి ఆటగాళ్లను విడుదల చేసింది.

బౌలింగ్‌లో అర్ష్‌దీప్ దూకుడు..

పంజాబ్ కింగ్స్ జట్టు మరోసారి అర్ష్‌దీప్ సింగ్‌పై నమ్మకం ఉంచింది. అర్ష్‌దీప్‌తో పాటు బౌలింగ్ బాధ్యతను యుజ్వేంద్ర చాహల్ నిర్వర్తించనున్నాడు.

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ XI..

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహాల్ వధేరా, ప్రియాంష్ ఆర్య, శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, మిచెల్ ఓవెన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..