IND vs SA: వన్డేల్లో తోపు ప్లేయర్లు.. కట్‌చేస్తే.. గంభీర్ మైండ్ గేమ్‌కు బలైన నలుగురు.. ఎవరంటే?

India vs South Africa: దక్షిణాఫ్రికా సిరీస్ కోసం వన్డే జట్టులో చోటు దక్కించుకోవడానికి నిజంగా అర్హులైన నలుగురు భారత ఆటగాళ్లను కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న తొందరపాటు ఎంపిక నిర్ణయాల కారణంగా జట్టు నుంచి తప్పించారు. ఇటీవలి మ్యాచ్‌లలో ఈ నలుగురూ అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు.

IND vs SA: వన్డేల్లో తోపు ప్లేయర్లు.. కట్‌చేస్తే.. గంభీర్ మైండ్ గేమ్‌కు బలైన నలుగురు.. ఎవరంటే?
Ind Vs Sa

Updated on: Dec 05, 2025 | 11:39 AM

India vs South Africa: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఎంపికలో కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి. జట్టులో స్థానం దక్కించుకోవడానికి పూర్తి అర్హతలు ఉన్నప్పటికీ, నలుగురు కీలక ఆటగాళ్లను పక్కన పెట్టడం గంభీర్ వ్యూహాత్మక నిర్ణయాల్లో భాగంగా కనిపిస్తోంది. గంభీర్ “చాణక్య నీతి” కారణంగా దక్షిణాఫ్రికా టూర్‌కు దూరమైన ఆ నలుగురు ఆటగాళ్లు ఎవరో ఓసారి చూద్దాం..

1. మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj): టీమిండియా పేస్ బౌలింగ్‌లో కీలకమైన సిరాజ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు కోల్పోయిన సిరాజ్, ఆస్ట్రేలియా పర్యటనలో కొంతమేర రాణించినా (3 మ్యాచుల్లో 2 వికెట్లు), సెలెక్టర్లు, కోచ్ గంభీర్ అతనిపై నమ్మకం ఉంచలేదు. అనుభవం, ఒత్తిడిని తట్టుకునే సత్తా ఉన్నా, భవిష్యత్తు వన్డే ప్రణాళికల్లో సిరాజ్ పాత్రపై సందేహాలు తలెత్తుతున్నాయి.

2. అక్షర్ పటేల్ (Axar Patel): అందరికంటే ఎక్కువగా అభిమానులను ఆశ్చర్యపరిచిన నిర్ణయం అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టడమే. నిలకడైన ఆల్ రౌండర్ అయిన అక్షర్, ఆస్ట్రేలియా టూర్‌లో బ్యాటింగ్ (44, 31 పరుగులు), బౌలింగ్‌లో (3 వికెట్లు) సత్తా చాటాడు. తన కెరీర్‌లో 858 పరుగులు, 75 వికెట్లతో మంచి రికార్డు ఉన్నప్పటికీ, గంభీర్ వ్యూహాల్లో అతనికి చోటు దక్కలేదు. దీంతో జట్టులో లోయర్ ఆర్డర్ బ్యాటింగ్, స్పిన్ విభాగంలో లోటు కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

3. సంజు శాంసన్ (Sanju Samson): వన్డేల్లో అత్యంత దురదృష్టవంతుడైన ఆటగాడిగా సంజు శాంసన్ నిలుస్తున్నాడు. తన చివరి వన్డేలో మ్యాచ్ విన్నింగ్ సెంచరీ చేసినప్పటికీ, అతన్ని మరోసారి పక్కన పెట్టారు. కె.ఎల్. రాహుల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ రూపంలో ముగ్గురు వికెట్ కీపర్లను ఎంపిక చేయడంతో శాంసన్‌కు మొండిచేయి ఎదురైంది. అతని ప్రతిభను సరైన రీతిలో వినియోగించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

4. వరుణ్ చక్రవర్తి (Varun Chakaravarthy): ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా నిలిచిన వరుణ్ చక్రవర్తిని కూడా సెలెక్టర్లు విస్మరించారు. మిస్టరీ స్పిన్నర్‌గా జట్టుకు ఎంతో ఉపయోగపడే వరుణ్, ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక కాలేదు, ఇప్పుడు దక్షిణాఫ్రికా సిరీస్‌లోనూ చోటు దక్కించుకోలేకపోయాడు.

కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను పక్కన పెట్టడం ఎంతవరకు సరైనదో కాలమే నిర్ణయించాలి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..