Watch Video: సురేశ్ రైనా ఫ్యాన్స్ అంటే అట్లుంటది మరి.. నెట్టింట్లో వీడియో వైరల్

|

Jul 31, 2022 | 10:16 PM

భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు సురేశ్ రైనాకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో ఓ అభిమాని రైనా ఫోటోకు పూజలు చేస్తూ కనిపించాడు.

Watch Video: సురేశ్ రైనా ఫ్యాన్స్ అంటే అట్లుంటది మరి.. నెట్టింట్లో వీడియో వైరల్
Suresh Raina
Follow us on

భారత క్రికెట్ జట్టు ఆటగాడు సురేశ్ రైనా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. కానీ ఇప్పటికీ అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు. తాజాగా రైనాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో ఓ అభిమాని రైనా ఫొటోను పూజిస్తూ కనిపించాడు. ఈ వీడియోను రైనా ట్విట్టర్‌లో రీట్వీట్ చేశాడు. ఈ వీడియో పాతదే అయినా ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఈ వీడియోను రైనా అభిమాని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఇందులో ఓ అభిమాని రైనా చిత్రపటానికి పూజలు చేస్తూ కనిపించాడు. అభిమాని మొదట రైనా చిత్రానికి దీపం చూపించి, ఆపై దానిపై పాలు పోస్తున్నట్లు చూడొచ్చు. ఈ వీడియోను రైనా రీట్వీట్ చేశాడు. ఈ వీడియో మరోసారి నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీన్ని ట్విట్టర్‌లో 800 మందికి పైగా లైక్ చేశారు. కాగా దాదాపు 100 మంది దీనిని రీట్వీట్ చేశారు.

రైనా టీమ్ ఇండియా తరపున 226 వన్డేల్లో 5615 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 5 సెంచరీలు, 36 అర్ధ సెంచరీలు సాధించాడు. 78 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 1604 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతను ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలు సాధించాడు.