భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virendra Sehwag) తన ఫన్నీ ట్వీట్లకు పేరు. సోషల్ మీడియాలో సెహ్వాగ్ చేసే ట్వీట్లు తెగ నవ్వులు పూయిస్తుంటాయి. అతనికి ఎవరైన దొరికారంటే ఓ ఆట ఆడుకుంటాడు. పాకిస్తాన్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయే సెహ్వా్గ్.. పాకిస్తాన్‌కు చెందిన ఓ పొలిటికల్ కామెంటేటర్ ట్విట్టర్ వేదికగా దొరికిపోయాడు. ఇటీవల, తన తప్పుడు ట్వీట్‌తో పాకిస్తాన్ జర్నలిస్ట్‌ను ఉతికి ఆరేశాడు. ఈ పాకిస్తానీ పొలిటికల్ కామెంటేటర్ జామ్ హమీద్ భారత క్రీడాకారుడిని టార్గెట్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచినందుకు పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌ను అభినందిస్తూ ఒక ట్వీట్ చేశాడు. అదే ట్వీట్‌లో అతను భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై సెటైర్లు వేస్తూ తన వక్ర బుద్ధిని ప్రదర్శించాడు.
ఒలింపిక్ స్వర్ణ పతక విజేత భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 90 మీటర్ల మార్క్‌ను అందుకోలేదు అంటూ కామెంట్స్ చేశాడు. వాస్తవానికి నీరజ్ చోప్రా గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్‌కు దూరమయ్యాడు. భారత జావెలిన్ త్రో హీరో నీరజ్ చోప్రాపై వ్యంగ్యాస్త్రాలు సాధిస్తూ ట్వీట్ చేయబోయాడు.. ఈ క్రమంలో నీరజ్ చోప్రా బదులుగా ఆశిష్ నెహ్రా పేరు కోడ్ చేశాడు. ఇలా సెహ్వాగ్‌కు దొరికిపోయాడు. భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రాను జావెలిన్ త్రోయర్‌గా తప్పుగా పోల్చాడు.
Chicha, Ashish Nehra is right now preparing for UK Prime Minister Elections. So Chill ? pic.twitter.com/yaiUKxlB1Z
— Virender Sehwag (@virendersehwag) August 11, 2022
సెహ్వాగ్‌ని తీవ్రంగా
పాకిస్తాన్‌ను ఆడుకోవడంలో ముందుండే సెహ్వాగ్ దొరికిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. ‘చిచ్చా.. ఆశిష్ నెహ్రా ప్రస్తుతం యూకే ప్రధాన మంత్రి ఎన్నికల కోసం రెడీ అవుతున్నాడు. కాబట్టి చిల్ అవ్వు’ అంటూ సెహ్వాగ్ సెటైర్ వేశాడు. నీరజ్ చోప్రాకు, ఆశిష్ నెహ్రాకు మధ్య తేడా నీకు తెలీదు కానీ చెప్పొచ్చావ్.. అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
సోషల్ మీడియాలోని ఇండియన్ ఫ్యాన్స్ పాకిస్తానీ చిచ్చాపై ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. లక్కీగా కేంద్ర ప్రభుత్వ లీగల్ డిమాండ్ కారణంగా హమీద్ ప్రొఫైల్ ఇండియాలో కనిపించడం లేదుకానీ.. కనిపిస్తే ట్విట్టర్‌లో దుమ్ము దులిపేవారు.
కామన్వెల్త్ గేమ్స్ 2022లో పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ 90.18 మీటర్ల దూరంలో జావెలిన్ విసిరి బంగారు పతకాన్ని సాధించాడు. అతను భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రికార్డును అధిగమించాడు. నిజానికి 89.94 మీటర్ల జావెలిన్ విసిరినది నీరజ్ రికార్డు ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం