India Vs England: ”ట్రోఫీ తెస్తారనుకుంటే.. ఇదేంటి మాస్టారూ” టీమిండియాను ఏకిపారేస్తున్న నెటిజన్లు.!

|

Sep 10, 2021 | 9:09 PM

India Vs England: మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన నిర్ణయాత్మక ఐదో టెస్ట్ రద్దయిన సంగతి తెలిసిందే. దీనితో టీమిండియా హెడ్ కోచ్‌తో పాటు..

India Vs England: ట్రోఫీ తెస్తారనుకుంటే.. ఇదేంటి మాస్టారూ టీమిండియాను ఏకిపారేస్తున్న నెటిజన్లు.!
Kohli
Follow us on

మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన నిర్ణయాత్మక ఐదో టెస్ట్ రద్దయిన సంగతి తెలిసిందే. దీనితో టీమిండియా హెడ్ కోచ్‌తో పాటు ఆటగాళ్లపై అటు ఇంగ్లీష్ మీడియా, ఇటు ఇండియన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతారహితంగా ప్రవర్తించి బుక్ లాంచ్ ఈవెంట్‌కు వెళ్లారని.. తద్వారా కీలక మ్యాచ్ జరగకుండా అడ్డుపడ్డారంటూ అక్కడి స్థానిక మీడియా టీమిండియాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఐదో టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఫిజియో యోగేశ్, కోచ్‌లు భరత్ అరుణ్, శ్రీధర్‌లు కరోనా బారిన పడని సంగతి తెలిసిందే. వారందరినీ క్వారంటైన్‌లో ఉంచి.. ఆటగాళ్లందరికీ కరోనా టెస్టులు చేయగా.. రిపోర్టుల్లో నెగటివ్ తేలింది. అయినప్పటికీ కొంతమంది ఆటగాళ్లు మ్యాచ్ ఆడటంపై విముఖత వ్యక్తం చేస్తూ బీసీసీఐకి లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ నేపధ్యంలోనే రెండు దేశాల క్రికెట్ బోర్డులు ఏకాభిప్రాయానికి వచ్చి మాంచెస్టర్‌లోని ఓవల్ ట్రాఫోర్డ్ మైదానంలో జరగాల్సిన ఐదో టెస్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే అక్కడి స్థానిక మీడియా భారత్ కోచ్‌లు, ఆటగాళ్ల తీరుపై విమర్శలు గుప్పించింది. ”బయోబబుల్ నిబంధనలను ఉల్లంఘించి.. ఇండియన్ కోచ్‌లు, ఆటగాళ్లు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళ్లడం బాధ్యతారాహిత్యం. నాలుగో టెస్టుకు రెండు రోజుల ముందు టీమిండియా ప్లేయర్స్ బుక్ లాంచ్ కార్యక్రమానికి వెళ్లినట్లుగా స్పోర్ట్స్ మెయిల్ వెల్లడించింది” ఈ అంశంపై డైలీ మెయిల్‌లో ఓ కథనం కూడా ప్రచురితమైంది. మరోవైపు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ, మరికొందరు క్రికెటర్లు పుస్తకావిష్కరణకు హాజరైనందుకు బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసిందని పలు వార్తలు కూడా వెలువడిన సంగతి తెలిసిందే.

కాగా, కోవిడ్ కారణంగా ఐదో టెస్ట్ రద్దు కావడంతో టీమిండియా తీరుపై ఇండియన్ ఫ్యాన్స్ సైతం విమర్శిస్తున్నారు. ”ట్రోఫీ తెస్తారనుకుంటే.. ఇలా చేసేరేంటి’ అంటూ ప్రశ్నిస్తున్నారు. రవిశాస్త్రి, కోహ్లీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇక రద్దయిన ఈ మ్యాచ్‌ను వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో టీమిండియా పర్యటించినప్పుడు నిర్వహించి.. సిరీస్ విజేతను నిర్ణయిస్తారని తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, వేల్స్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.