T20 World Cup: జట్టు నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్న.. ఇయాన్ మోర్గాన్ సంచలన వ్యాఖ్యలు!..

టీ 20 ప్రపంచకప్ జట్టు నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు. 35 ఏళ్ల మోర్గాన్ ఈ సంవత్సరంలో ఏడు టీ 20 మ్యాచ్‎లు ఆడి 82 పరుగులు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో 11.08 సగటుతో 133 పరుగులు చేశాడు...

T20 World Cup: జట్టు నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్న.. ఇయాన్ మోర్గాన్ సంచలన వ్యాఖ్యలు!..
Morgan

Updated on: Oct 20, 2021 | 7:31 AM

టీ 20 ప్రపంచకప్ జట్టు నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు. 35 ఏళ్ల మోర్గాన్ ఈ సంవత్సరంలో ఏడు టీ 20 మ్యాచ్‎లు ఆడి 82 పరుగులు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో 11.08 సగటుతో 133 పరుగులు చేశాడు. అయినప్పటికీ అతను గత వారం ఫైనల్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు నాయకత్వం వహించాడు. 2019 లో వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన జట్టు, 2016 లో టీ 20 ప్రపంచ కప్ ఫైనల్లో కూడా మోర్గాన్ ఇంగ్లాండ్‌కు నాయకత్వం వహించాడు. అయితే ఇప్పుడు అతని ఫామ్‎పై చర్చ జరుగుతుంది. భారత్‎తో జరిగిన వార్మప్ మ్యాచ్‎లో మోర్గాన్ ఆడలేదు. “నేను ప్రపంచ కప్ గెలుచుకున్న జట్టుకు ఆటంకం కలిగించడం లేదు. సహజంగానే, నేను పరుగులు చేయలేకపోయాను, నా కెప్టెన్సీ చాలా బాగుంది” అని మోర్గాన్ చెప్పాడు.

” ఐదేళ్ల క్రితం టీ 20 వరల్డ్ కప్‎లో ఇంగ్లాండ్ ఫైనల్ వరకు వెళ్లింది. ఫైనల్లో విజయానికి చేరువుతున్న క్రమంలో చివరి ఓవర్‌లో కార్లోస్ బ్రాత్‌వైట్ వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టి వెస్టిండీస్‌కు టైటిల్ అందించాడు.
ఏమి జరిగిందో అర్థం చేసుకోవడానికి తనకి సుమారు ఆరు లేదా ఏడు నెలలు పట్టిందని” మోర్గాన్ మంగళవారం వెల్లడించాడు. ఒక వ్యక్తి వచ్చి తన జట్టులో గేమ్ గెలవడానికి వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టడం అనేది కేవలం ఒక అద్భుతమైన ఫీట్, అది నేను అర్థం చేసుకున్న మార్గంమని చెప్పాడు. “మోర్గాన్ గత రెండు సంవత్సరాలలో చాలా వరకు కఠినమైన బయో బబుల్‎లో ఉంటూ క్రికెట్ ఆడారు.

Read Also.. T20 World Cup: చెలరేగిన నయీమ్, ముస్తాఫిజుర్‌.. 26 పరుగుల తేడాతో ఒమన్‎పై బంగ్లాదేశ్‌ విజయం