INDIA VS ENGLAND 2021: క్రికెట్ మ్యా్చ్‌లో అప్పుడప్పుడు అంఫైర్ నిర్ణయం తప్పుగా ఉంటుంది. ఆ సమయంలో థర్డ్ అంపైర్ కీలకంగా వ్యవహరిస్తారు. కానీ థర్డ్ అంపైరే తప్పు చేస్తే ఏంటి పరిస్థితి సరిగ్గా భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టస్ట్‌లో అదే జరిగింది. అయితే ఈ ఫలితం అనుభవించిన జట్టుకు మాత్రం శాపంగా మారుతుంది. మొదటి రోజున జరగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..
ఇన్నింగ్స్ 75వ ఓవర్లో స్పిన్నర్ జాక్ లీచ్ డెలివరీ రహానే గ్లౌజులను తాకుతూ ఫార్వర్డ్ షార్ట్ లెగ్‌లో ఉన్న ఓలీ పోప్ చేతుల్లో పడింది. ఇంగ్లండ్ చేసిన ఈ అప్పీల్‌ను ఫీల్డ్ అంపైర్లు పట్టించుకోలేదు. దీంతో కెప్టెన్ రూట్ రివ్యూకు వెళ్లాడు. టీవీ రీప్లేలు చూసిన థర్డ్ అంపైర్ అనిల్ చౌదరీ కూడా పొరపాటు చేశారు. ఆయన రీప్లేలన్నీ ఎల్బీడబ్ల్యూ కోసం పరిశీలించారు. కానీ క్యాచ్ ఔట్ అనే సంగతి మరిచారు. ఎల్బీ కాకపోవడంతో నాటౌట్ ఇచ్చారు. దీనిపై అప్పుడే రూట్ గ్లౌజులను తాకుతూనే వెళ్లిందిగా అన్నట్లు సంజ్ఞలు చేసి అసంతృప్తి వెళ్లగక్కాడు. మొత్తానికి రివ్యూ సఫలం కాకపోవడంతో ఒక రివ్యూను ఇంగ్లండ్ కోల్పోయింది. తదనంతర పరిశీలనలో కోల్పోయిన ఈ రివ్యూను పునరుద్ధరించారు.
అజింక్యా మా అగ్రశేణి ఆటగాళ్లలో ఒకడు.. అవసరమైన ప్రతిసారి అండగా నిలుస్తాడంటున్న హిట్‌మ్యాన్..