వామ్మో, 100 కిలోమీటర్లు పరుగెత్తి వచ్చి బౌలింగ్.. ఇంగ్లండ్ క్రికెటర్ సంచలన రికార్డ్.. ఎందుకో తెలుసా.?

England Cricketer 100km Bowling Run Up: ఫాస్ట్ బౌలర్లు చాలా దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ చేయడం మనం చూస్తుంటాం. మహా అంటే వాళ్లు 20 నుంచి 30 గజాల దూరం పరుగెత్తుతారు. కానీ తాజాగా ఓ క్రికెటర్ 62 మైళ్ల (100 కిలోమీటర్ల) దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ చేసి కొత్త రికార్డ్ సృష్టించడం విశేషం.

వామ్మో, 100 కిలోమీటర్లు పరుగెత్తి వచ్చి బౌలింగ్.. ఇంగ్లండ్ క్రికెటర్ సంచలన రికార్డ్.. ఎందుకో తెలుసా.?
Sam Bowdovano Runs 100km At Lords

Updated on: Sep 04, 2026 | 1:07 PM

England Cricketer 100km Bowling Run Up: క్రికెట్‌లో సాధారణంగా ఫాస్ట్ బౌలర్లు 20 నుంచి 30 గజాల దూరం పరుగెత్తుతూ బౌలింగ్ చేస్తుంటారు. కానీ ఇంగ్లండ్‌కు చెందిన క్లబ్ క్రికెటర్ సామ్ బోడోవానో మాత్రం ఏకంగా 100 కిలోమీటర్లు పరుగెత్తి వచ్చి బౌలింగ్ చేసి సరికొత్త రికార్డు సృష్టించే ప్రయత్నం చేశాడు. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ బౌలింగ్ రన్-అప్‌గా నిలిచే ఈ ప్రయత్నానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు పరిశీలనలో ఉంది.

లార్డ్స్ నుంచి 100 కి.మీల పరుగు..

క్రికెట్ పుట్టినిల్లు లండన్‌లోని చారిత్రక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ నుంచి సామ్ తన పరుగు ప్రారంభించాడు. అర్ధరాత్రి 12 గంటలకు మొదలైన ఈ ప్రయాణంలో దాదాపు 14 గంటల పాటు నిరంతరంగా పరుగెత్తి, వోకింగ్‌లోని వాలీ ఎండ్ క్రికెట్ క్లబ్‌కు చేరుకున్నాడు. మొత్తం దూరం సుమారు 62 మైళ్లు (100 కి.మీ).

ఎక్కువమంది చదివినది: 10880, 124, 18లతో లేడీ కోహ్లీ విధ్వంసం.. మిథాలీ ఆల్ టైం రికార్డ్ బ్రేక్.. హిస్టరీలోనే సరికొత్త క్రికెట్ క్వీన్‌గా..

ఇవి కూడా చదవండి

గిన్నిస్ రికార్డు కోసం కఠిన నిబంధనలు..

ఈ ప్రయత్నాన్ని అధికారిక రికార్డుగా గుర్తించాలంటే సామ్ పలు నిబంధనలు పాటించాల్సి వచ్చింది.

సాధారణ రన్నింగ్ దుస్తులు కాకుండా పూర్తి తెల్లటి క్రికెట్ కిట్‌లోనే 100 కి.మీలు పరుగెత్తాలి.

పరుగు మొదటి అడుగులో చేతిలో తీసుకున్న క్రికెట్ బంతిని చివరి వరకు తన వద్దే ఉంచుకోవాలి.

పరుగెత్తి వచ్చిన తర్వాత అధికారిక అంపైర్ల సమక్షంలో పూర్తి క్రికెట్ మ్యాచ్ జరగాలి.

14 గంటల పరుగుతో మైదానానికి చేరుకున్న వెంటనే అదే ఊపులో మ్యాచ్ తొలి బంతిని తన తండ్రికే వేశాడు.

24 కి.మీ రికార్డును ఏకంగా 100 కి.మీలకి..

ఇంతకుముందు ఈ విభాగంలో రికార్డు టామ్ డన్ పేరిట ఉంది. 2024 ఆగస్టులో అతడు బెత్నల్ గ్రీన్ నుంచి వాండ్స్‌వర్త్ కామన్ వరకు 15 మైళ్లు (సుమారు 24 కి.మీ) పరుగెత్తి వచ్చి బౌలింగ్ చేశాడు.

ఎక్కువమంది చదివినది: Video: మ్యాజిక్ బాల్‌తో మెంటలెక్కించిన టీమిండియా ఛీ కొట్టిన ప్లేయర్.. వీడియో చూస్తే..!

ఇప్పుడు సామ్ బోడోవానో ఆ దూరాన్ని ఏకంగా 62 మైళ్లకు పెంచాడు. అయితే గిన్నిస్ అధికారులు రికార్డును ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. మరో రెండు వారాల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

క్యాన్సర్ బాధితుల కోసం కూడా..

సామ్ చేసిన ఈ సాహసం కేవలం రికార్డు కోసమే కాదు. బ్రిటన్‌కు చెందిన రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ అనే క్యాన్సర్ స్వచ్ఛంద సంస్థ కోసం ఈ పరుగు ద్వారా సుమారు 6,000 పౌండ్లు (రూ.6.5 లక్షలకు పైగా) విరాళాలను కూడా సమీకరించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us