India Vs England Test series : సుధీర్ఘ భారత పర్యటనకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు సిద్ధమయ్యారు. శ్రీలంక పర్యటన ముగించుకొని చెన్నైకి చేరుకుంటున్నారు. ఇంగ్లాండ్‌తో భారత్ నాలుగు టెస్టులు, అయిదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. చెన్నై వేదికగా మొదటి రెండు టెస్టులు జరగనున్నాయి. ఫిబ్రవరి 5న తొలి టెస్టు ప్రారంభం కానుంది. కాగా, లంకతో సిరీస్‌కు దూరమైన బెన్‌స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ ఆదివారమే చెన్నైలో అడుగుపెట్టారు.
మరోవైపు భారత ఆటగాళ్లు విడివిడిగా చెన్నైకి చేరుకుంటున్నారు. రోహిత్ శర్మ, అజింక్య రహానె, శార్దూల్ ఠాకూర్ మంగళవారమే చెన్నైకి రాగా, పుజారా, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ బుధవారం ఉదయం చేరుకున్నారు. వారితో పాటు కోచ్ రవిశాస్త్రి, సహాయక సిబ్బంది కూడా వచ్చారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టుతో సాయంత్రం కలిసే అవకాశం ఉంది. బయోబబుల్ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు కొవిడ్-19 పరీక్షలకు హాజరవుతూ ఆరు రోజులు క్వారంటైన్‌లో ఉండనున్నారు.
? Chennai, India@root66 and the team have arrived in India ahead of our four-match Test series ????????? pic.twitter.com/GT06p9Ru4u
— England Cricket (@englandcricket) January 27, 2021