IND vs ENG: సత్తా చాటిన హర్షిత్ రాణా, జడేజా.. 248 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్..

నాగ్‌పూర్‌లో జరుగుతోన్న తొలి వన్డేలో ఇంగ్లండ్ జట్టు 248 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టు ముందు 249 పరుగుల టార్గెట్‌ ఉంచింది. ఇంగ్లండ్ తరపున జోస్ బట్లర్ (52), బెతెల్ (51) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఫిల్ సాల్ట్ 43 పరుగులు, బెన్ డకెట్ 32 పరుగులతో పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఇక భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3, రవీంద్ర జడేజా 3 వికెట్లతో సత్తా చాటగా, షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

IND vs ENG: సత్తా చాటిన హర్షిత్ రాణా, జడేజా.. 248 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్..
India Vs England

Updated on: Feb 06, 2025 | 6:04 PM

India vs England, 1st ODI: వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు భారత్‌కు 249 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత జట్టు ముందు 249 పరుగుల టార్గెట్‌ ఉంచింది. ఇంగ్లండ్ తరపున జోస్ బట్లర్ (52), బెతెల్ (51) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఫిల్ సాల్ట్ 43 పరుగులు, బెన్ డకెట్ 32 పరుగులతో పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు.

ఇక భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3, రవీంద్ర జడేజా 3 వికెట్లతో సత్తా చాటగా, షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్, యూఏఈలలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ దృష్ట్యా ఈ సిరీస్ ముఖ్యమైనది. గత ఏడాది టీమిండియా కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..