Telugu News Sports News Cricket news ENG vs SA Tristan Stubbs' One Handed Diving Stunner To Dismiss Moeen Ali In 3rd T20I Watch Video Telugu Cricket News
Viral Video: స్టబ్స్, నువ్వు సూపరహే.. స్టన్నింగ్ క్యాచ్ పట్టిన సౌతాఫ్రికా ప్లేయర్.. వైరలవుతోన్న వీడియో
ENG vs SA: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో స్టబ్స్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. మర్కరమ్ బౌలింగ్‌లో మొయిన్ అలీ మిడాన్ వైపు ఆడగా.. అక్కడే ఉన్న స్టబ్స్ అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసిపట్టుకున్నాడు.
Ad
Tristan Stubbs
Follow us on
ENG vs SA: సరిగ్గా 4 రోజుల క్రితం (జులై27) టీ20 సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 234 పరుగులు చేసింది. బదులుగా సఫారీలు బాగానే పోరాడారు. అయితే ఆ జట్టు పోరాటం 193 పరుగుల దగ్గరే ఆగిపోయింది. ప్రొటీస్‌లు ఇక్కడి దాకా వచ్చారంటే అందుకు ప్రధాన కారణం ఆ జట్టు యంగ్ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ (Tristan Stubbs). 21 ఏళ్ల ఈ ప్లేయర్ కేవలం 28 బంతుల్లోనే 72 రన్స్ చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. ఆ మ్యాచ్‌లో బ్యాట్‌తో మెరుపులు మెరిపించిన ఈ ఎమర్జింగ్ ప్లేయర్ ఇప్పుడు ఫీల్డింగ్‌లో తళుక్కుమన్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో అతను అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. మర్కరమ్ బౌలింగ్‌లో మొయిన్ అలీ మిడాన్ వైపు ఆడగా.. అక్కడే ఉన్న స్టబ్స్ అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసిపట్టుకున్నాడు.. ఈ స్టన్నింగ్ క్యాచ్‌ని అలీతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘కిర్రాక్, స్టన్నింగ్ క్యాచ్, సూపర్బ్’ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.