Team India: నాడు స్వింగ్ కింగ్.. నేడు అర్ధాంతరంగా కెరీర్ క్లోజ్.. ఇకపై ఐపీఎలే దిక్కు.!

నాడు అతడే ఒక స్వింగ్ కింగ్.. ధోని సారధ్యంలో పవర్ ప్లే ఓవర్లలో బౌలింగ్ వేశాడంటే.. ప్రత్యర్ధులు బెంబేలెత్తిపోయేవారు. మ్యాచ్ ఆరంభంలోనే టీమిండియాకు వికెట్లు అందించి అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇంతటి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న ఈ ప్లేయర్ కెరీర్‌ను అర్ధాంతరంగా క్లోజ్ చేస్తోంది బీసీసీఐ. దాదాపుగా ఈ ఆటగాడు టీమిండియా తరపున టెస్టులు అటుంచితే.. టీ20లు, వన్డేల్లోకి కూడా రీ-ఎంట్రీ ఇవ్వడం అసాధ్యమనిపిస్తోంది.

Team India: నాడు స్వింగ్ కింగ్.. నేడు అర్ధాంతరంగా కెరీర్ క్లోజ్.. ఇకపై ఐపీఎలే దిక్కు.!
Team India

Updated on: Jul 28, 2023 | 9:00 PM

నాడు అతడే ఒక స్వింగ్ కింగ్.. ధోని సారధ్యంలో పవర్ ప్లే ఓవర్లలో బౌలింగ్ వేశాడంటే.. ప్రత్యర్ధులు బెంబేలెత్తిపోయేవారు. మ్యాచ్ ఆరంభంలోనే టీమిండియాకు వికెట్లు అందించి అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇంతటి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న ఈ ప్లేయర్ కెరీర్‌ను అర్ధాంతరంగా క్లోజ్ చేస్తోంది బీసీసీఐ. దాదాపుగా ఈ ఆటగాడు టీమిండియా తరపున టెస్టులు అటుంచితే.. టీ20లు, వన్డేల్లోకి కూడా రీ-ఎంట్రీ ఇవ్వడం అసాధ్యమనిపిస్తోంది. అతడు మరెవరో కాదు.. భువనేశ్వర్ కుమార్.

ఈ టీమిండియా వెటరన్ స్వింగ్ బౌలర్.. మ్యాచ్ ఏదైనా.. పిచ్ ఎలా ఉన్నా.. స్వింగ్‌తో ప్రత్యర్ధులను బెంబేలెత్తిస్తాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో భువీ.. 14 మ్యాచ్‌లు ఆడి.. 16 వికెట్లు పడగొట్టడమే కాదు.. పొదుపుగా బౌలింగ్ చేసి.. రెండుసార్లు 4 వికెట్లు, ఒకసారి 5 వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచకప్‌లోనూ మంచి ప్రదర్శన కనబరిచిన భువీని.. అర్ధాంతరంగా జట్టు నుంచి తప్పించింది బీసీసీఐ. అలాగే గతేడాది సెంట్రల్ కాంట్రాక్టులో ‘సి’ గ్రేడ్ దక్కించుకున్న భువీని.. ఈ ఏడాది పక్కనపెట్టేసింది. మొదట టెస్టు, ఆ తర్వాత టీ20, ఇప్పుడు వన్డే.. ఇలా అన్ని ఫార్మాట్లకు భువనేశ్వర్‌కు ఎండ్ కార్డు పలికిన బీసీసీఐ.. ఇక అతడు రిటైర్మెంట్ ప్రకటించడం కోసమే ఎదురుచూస్తున్నట్టు ఉందని మాజీలు అంటున్నారు.

తాజాగా భువనేశ్వర్ కుమార్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో ఉన్న ‘Indian Cricketer’ను కాస్తా ‘Indian’ అని మార్చేశాడు. దీంతో నెటిజన్ల కూడా ఇక భువీ కెరీర్‌కు ఎండ్ కార్డు పడ్డట్టే అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, టీమిండియా తరపున గతేడాది జనవరిలో భువీ చివరి వన్డే ఆడగా.. అదే ఏడాది నవంబర్‌లో చివరి టీ20, 2018 జనవరిలో చివరిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇక ఇప్పుడు భువనేశ్వర్ కుమార్‌కు ఐపీఎల్ ఒక్కటే దిక్కుగా కనిపిస్తోంది.