BCCI: దేశీయ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను పెంచాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయించింది. దేశీయ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను పెంచాలని బోర్డు నిర్ణయించిందని బోర్డు కార్యదర్శి జైషా సోమవారం ట్వీట్ చేశారు. 40 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన దేశీయ ఆటగాళ్లు ప్రస్తుతం రూ. 60,000 పొందుతారు. అలాగే 23 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆటగాళ్లకు రూ. 25,000, 19 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న క్రికెటర్లకు బోర్డు ద్వారా రూ .20,000 ఫీజుగా పొందనున్నారు.
2019-20 దేశీయ సీజన్‌లో పాల్గొనే క్రికెటర్లకు కరోనావైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే 2020-21 సీజన్‌లో వారికి పరిహారంగా అదనంగా 50 శాతం మ్యాచ్ ఫీజు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
జై షా ట్వీట్..
బోర్డ్ సెక్రటరీ జైషా తన ట్వీట్‌లో “దేశవాళీ క్రికెటర్ల కోసం మ్యాచ్ ఫీజుల పెంపును ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. సీనియర్స్- రూ. 60,000లు (40 మ్యాచ్‌ల పైన), 23 ఏళ్లలోపు లోపు- రూ. 25,000, 19 ఏల్ల లోపు- రూ. 20,000లు పొందుతారు” అని రాసుకొచ్చారు.
I am pleased to announce the hike in match fee for domestic cricketers.
Seniors – INR 60,000 (above 40 matches).
Under 23- INR 25,000
Under 19 – INR 20,000#BCCIApexCouncil
— Jay Shah (@JayShah) September 20, 2021
Also Read: Virat Kohli Lamborghini Car: అమ్మకానికి విరాట్ కోహ్లీ మాజీ కారు.. ధరెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
IPL 2021: ఐపీఎల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు.. అత్యధిక సార్లు గెలుచుకుంది వీరే..!