IND vs NZ: న్యూజిలాండ్‌తో ఘోర ఓటమి.. టీమిండియా జట్టులోంచి ఆ స్టార్ పేసర్ ఔట్?

|

Oct 28, 2024 | 9:48 AM

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి, రెండో టెస్టుల్లో ఓడిన టీమిండియా సిరీస్‌ను కోల్పోయింది. ఇప్పుడు సిరీస్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 1 నుంచి ముంబైలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలవడం భారత్‌కు చాలా ముఖ్యం, ఎందుకంటే ఓడిపోతే కీవిస్ చేతిలో క్లీన్‌స్వీప్‌‌గా నిలుస్తుంది. ఇది టీమిండియాకు తీవ్ర అవమానం.. అలాగే ఈ మ్యాచ్ ఓడిపోతే WTC ఫైనల్‌కు నుంచి భారత్ నిష్క్రమిస్తుంది.

IND vs NZ: న్యూజిలాండ్‌తో ఘోర ఓటమి.. టీమిండియా జట్టులోంచి ఆ స్టార్ పేసర్ ఔట్?
Jasprit Bumrah Need Rest
Follow us on

టీమ్‌ఇండియా చేతిలో నుంచి న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ చేజారిపోయింది. బెంగళూరు, పుణె టెస్టుల్లో న్యూజిలాండ్ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న చివరి మ్యాచ్ మిగిలి ఉంది. ఈ సిరీస్‌లో పరువు కాపాడుకునేందుకు టీమిండియాకు ఇదే చివరి అవకాశం. అయితే ఈ మ్యాచ్ నుండి టీమిండియా స్టార్ ప్లేయర్‌ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా‌కు విశ్రాంతి ఇవ్వాలని మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ డిమాండ్ చేశారు.

మూడో టెస్టులో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మాజీ ఆటగాడు కార్తీక్ అభిప్రాయపడ్డాడు. క్రిక్‌బజ్ షోలో దీని గురించి కార్తీక్ మాట్లాడుతూ, బుమ్రాకు చాలా విశ్రాంతి అవసరమని, టీమ్ కూడా బుమ్రా రెస్ట్ ఇస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్ మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వస్తాడని కార్తీక్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే చివరి టెస్టుకు జట్టులో మరిన్ని మార్పులు ఉండకపోవచ్చని చెప్పవచ్చు అని ఆయన పేర్కొన్నారు.

న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్ తర్వాత, టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాలి. అక్కడ 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాలి. ఆస్ట్రేలియాలో, ఈసారి మహ్మద్ షమీ కూడా జట్టులో లేకపోవడంతో ఎక్కువ బాధ్యత బుమ్రాపైనే ఉంటుంది. కావున బుమ్రానే అక్కడ మొత్తం 5 మ్యాచ్‌లు ఆడవలసి ఉంటుంది. ఈ సందర్భంగా  బుమ్రా ఒక టెస్టుకు రిస్క్ తీసుకొని రెస్ట్ ఇవ్వాలని పలువురు క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి