
Dhruv Jurel Century: శ్రీలంకతో జరుగుతున్న 2వ టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. సెంచరీతో ఆకట్టుకుని అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. 7వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జురెల్ 115 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో శ్రీలంక గడ్డపై 7వ స్థానంలో క్రీజులోకి వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత దిగ్గజం మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ పేరిట ఉంది. 2010లో ఇదే కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో ధోనీ 76 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. సరిగ్గా 16 సంత్సరాల తర్వాత అదే వేదికపై జురెల్ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాకుండా శ్రీలంకలో తన తొలి పర్యటనలోనే ధోనీతో పోలిస్తే అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. ఈక్రమంలో ఏడో స్థానంలో బరిలోకి వచ్చి సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా సరికొత్త రికార్డ్ లిఖించాడు.
రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 503 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్, జురేల్ సెంచరీలతో ఆకట్టుకోగా.. శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ హాఫ్ సెంచరీలతో రాణించారు.
జురెల్ 115 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో శ్రీలంకలో ఏడో స్థానంలో అత్యధిక స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈలిస్ట్‌లో ఎంఎస్ ధోనీ 76 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఎక్కువమంది చదివినది: Video: దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. అసలు సీక్రెట్ ఏంటంటే..?
ధ్రువ్ జురెల్ – 115* (కొలంబో, 2026)
ఎంఎస్ ధోనీ – 76 (కొలంబో, 2010)
వృద్ధిమాన్ సాహా – 67 (కొలంబో, 2017)
వీవీఎస్ లక్ష్మణ్ – 61* (పి. సారా ఓవల్, 2008)
మొహిందర్ అమర్‌నాథ్ – 60 (పి. సారా ఓవల్, 1985)
1985లో శ్రీలంక పర్యటనలో మొహిందర్ అమర్‌నాథ్ ఏడో స్థానంలో బరిలోకి దిగి తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 2008లో వీవీఎస్ లక్ష్మణ్ ఆ ఘనతను రిపీట్ చేయగా.. 2010లో ధోనీ 76 పరుగులతో మరో రికార్డును నెలకొల్పాడు. 2017లో వృద్ధిమాన్ సాహా 67 పరుగులు చేసినా ధోనీని దాటలేకపోయాడు. ఇప్పుడు జురెల్ ఏకంగా తొలి సెంచరీ చేసిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
శ్రీలంకలో ధోనీ, జురెల్ టెస్టు గణాంకాలను పరిశీలిస్తే జురెల్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ధోనీ శ్రీలంకలో 3 టెస్టులు ఆడి 132 పరుగులు చేయగా, సగటు 32గా ఉంది. ఇక జురెల్ విషయానికి వస్తే 3 ఇన్నింగ్స్‌ల్లో 168 పరుగులు సాధించాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ, సెంచరీ ఉన్నాయి. కాగా, జురేల్ బ్యాటింగ్ సగటు 76.5గా ఉంది. స్ట్రైక్‌రేట్ 64.28గా నమోదైంది. మరోవైపు ధోనీ స్ట్రైక్‌రేట్ 58.18గా నిలిచింది. అయితే, గాలె ఇంటర్నేషనల్ స్టేడియంలో ధోనీ 2 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 33 పరుగులే చేయగా.. జురెల్ అక్కడ తన తొలి టెస్టులోనే మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..