Delhi Capitals vs Royal Challengers Bangalore Live Score in Telugu: డుప్లెసిస్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టోర్నీలో నాలుగో విజయాన్ని నమోదు చేసింది. శనివారం రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో డుప్లెసిస్ సేన 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 189/5 పరుగులు సాధించింది. ఢిల్లీ ఈ స్కోరును ఛేదించలేక 173/7 కే పరిమితమైంది.
ఐపీఎల్- 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ఒడిదొడుకుల ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. డుప్లెసిస్ సారథ్యంలోని RCB ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడగా మూడింటిలో విజయం సాధించింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు మ్యాచ్‌లు ఆడగా కేవలం రెండింట్లో మాత్రమే గెలిచి నాలుగు పాయింట్లు సాధించింది. ఇక గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించగా, RCB పరాజయం పాలైంది. ఈనేపథ్యంలో మరో విజయం కోసం ఇరు జట్లు పోటీపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇరు జట్ల ప్లేయింగ్ – XI
ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్(కెప్టెన్/ వికెట్ కీపర్ )పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, , రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్
గత మ్యాచ్ కు దూరమైన హర్షల్ పటేల్ మళ్లీ జట్టులోకి వచ్చాడు
ఆసీస్ ఆల్ రౌండర్ మిషెల్ మార్ష్ మొదటి మ్యాచ్ ఆడనున్నాడు.
ఢిల్లీ ఏడో వికెట్ కోల్పోయింది. 9 బంతుల్లో 17 పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్ జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ జట్టు విజయానికి ఇంకా 9 బంతుల్లో 33 పరుగులు అవసరం. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఆడుతున్నారు.
ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. క్రీజులో ఉన్న ఏకైక దిక్కు పంత్ (34) ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్‌లో భారీషాట్‌కు యత్నించిన అతను కోహ్లీ చేతికి చిక్కాడు. ఢిల్లీ విజయానికి ఇంకా 21 బంతుల్లో 48 పరుగులు అవసరం.
ఢిల్లీ కష్టాల్లో పడింది. 190 పరుగుల లక్ష్య ఛేదనలో 15 ఓవర్లు ముగిసేసరికి ఆజట్టు 115/5 పరుగులు చేసింది. క్రీజులో రిషభ్ పంత్ (15) ఉన్నాడు. ఆ జట్టు విజయానికి 30 బంతుల్లో 70 పరుగులు అవసరం.
వార్నర్ ఔటైన తర్వాత ఢిల్లీ స్కోరు మందగించింది. మార్ష్ (14), పంత్ (10) నెమ్మదిగా ఆడుతున్నారు. దీంతో రన్‌రేట్ భారీగా పెరిగిపోతోంది. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 13.5 ఓవర్లలో 112/2
ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. అర్ధసెంచరీ చేసిన డేవిడ్ వార్నర్ (66)ను వనిందు హసరంగా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మరోవైపు మిచెల్ మార్ష్ (10) నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 11.4 ఓవర్లలో 94/2.
డేవిడ్ వార్నర్ 29 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. అతనికి తోడుగా మిషెల్ మార్ష్ (3) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం ఢిల్లీ స్కోరు 8.4 ఓవర్లు ముగిసే సరికి 73/1. విజయానికి ఇంకా 68 బంతుల్లో 117 పరుగులు అవసరం.
రిషభ్ సేన మొదటి వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో పృథ్వీషా (16) ఔటయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీ స్కోరు 5 ఓవర్లు ముగిసే సరికి 50/1. డేవిడ్ వార్నర్ (32), మిషెల్ మార్ష్ (0) క్రీజులో ఉన్నారు.
డేవిడ్ వార్నర్ (15 బంతుల్లో 32) మెరుపులు మెరిపిస్తున్నాడు. దీంతో ఢిల్లీ 4.3 ఓవర్లలోనే 50 పరుగులకు చేరుకుంది.
ఢిల్లీ బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నాడు. ఓపెనర్లు పృథ్వీ షా (15), డేవిడ్ వార్నర్ (15) నిలకడగా ఆడుతున్నారు. దీంతో 3 ఓవర్లలోపే 30 పరుగులు చేసింది రిషభ్ సేన.
దినేశ్ కార్తీక్ (34 బంతుల్లో 65) మరోసారి అదరగొట్టాడు. అతనికి తోడు మ్యాక్స్ వెల్ (55) కూడా రాణించడంతో ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 189/5 పరుగుల భారీ స్కోరు సాధించింది. షాబాజ్ అహ్మద్ (32) నాటౌట్‌గా నిలిచాడు.
బెంగళూరు బ్యాటర్ దినేశ్ కార్తీక్ దంచికొడుతున్నాడు. కేవలం 26 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు షాబాజ్ అహ్మద్ (21) నిలకడగా ఆడుతున్నాడు. 18 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ స్కోరు 160/5.
బెంగళూరు స్కోరు 100 దాటింది. షాబాజ్ అహ్మద్ (17), దినేశ్ కార్తీక్ (14) నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోరు 15.3 ఓవర్లు ముగిసే సరికి 118/5.
అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న మ్యాక్స్ వెల్ (55) ఔటయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీషాట్ కు యత్నించిన అతను బౌండరీ లైన్ వద్ద లలిత్ యాదవ్‌కు చిక్కాడు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోరు 11.2 ఓవర్లలో 92/5.
గ్లెన్ మ్యాక్స్ వెల్ 28 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి తోడుగా షాబాజ్ అహ్మద్ (4) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం బెంగళూరు స్కోరు10.2 ఓవర్లలో 84/4
ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ప్రభుదేశాయ్ (6) కుల్దీప్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరోవైపు మ్యాక్స్ వెల్ (48) అర్ధసెంచరీకి సమీపంలో ఉన్నాడు.
బెంగళూరు స్కోరు 8.1 ఓవర్లలో 50 పరుగులు దాటింది. మ్యాక్స్‌వెల్ (28) నిలకడగా ఆడుతున్నాడు. అతనికి తోడుగా ప్రభుదేశాయ్(2) క్రీజులో ఉన్నాడు.
నిలకడగా ఆడుతున్న విరాట్ కోహ్లీ (12) రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 7 ఓవర్లు ముగిసే సరికి 42/3. క్రీజులో మ్యాక్స్ వెల్ (20), ప్రభుదేశాయ్(1) ఉన్నారు.
ఆర్సీబీకి మరో షాక్ తగిలింది. కెప్టెన్ డుప్లెసిస్(8) మహ్మద్ ఖలీల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో మ్యాక్స్ వెల్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోరు 2.4 ఓవర్లలో 13/2.
బెంగళూరు మొదటి వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అనూజ్ రావత్ (0) ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో కింగ్ కోహ్లీ క్రీజులోకి అడుగుపెట్టాడు.
బెంగళూరు బ్యాటింగ్ ప్రారంభమైంది. కెప్టెన్ డుప్లెసిస్, అనూజ్ రావత్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ఢిల్లీ తరఫున ముస్తాఫిజుర్ రెహమాన్ మొదటి ఓవర్ అందుకున్నాడు.
బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. కాగా ఈ మైదానంలో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లే విజయాలు సాధిస్తుండడం విశేషం.