CSK vs PBKS, IPL 2022:
డిఫెండింగ్ ఛాంపియన్ గా ఐపీఎల్ టోర్నీలోకి బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) వరుసగా మూడో పరాజయాన్ని చవి చూసింది. ఆదివారం రాత్రి ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు ఏకంగా 54 పరుగుల తేడాతో చిత్తైంది. 180 పరుగుల లక్ష్య ఛేదనలో వరుసగా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 18 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. దీంతో రవీంద్ర జడేజా జట్టుకు వరుసగా మూడో ఓటమి తప్పలేదు.
పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ XI: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్ ), శిఖర్ ధావన్, భానుక రాజపక్సే (వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, షారుక్ ఖాన్, జితేష్ శర్మ, ఒడియన్ స్మిత్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI : రవీంద్ర జడేజా(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), శివమ్ దూబే, డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, డ్వైన్ ప్రిటోరియస్, ముఖేష్ చౌదరి
? Team News ?
1⃣ change for @ChennaiIPL as Chris Jordan is named in the team.
2⃣ changes for @PunjabKingsIPL as Vaibhav Arora & Jitesh Sharma make their debuts.
Follow the match ▶️ https://t.co/ZgMGLamhfU #TATAIPL | #CSKvPBKS
A look at the Playing XIs ? pic.twitter.com/97Miutyr6g
— IndianPremierLeague (@IPL) April 3, 2022
2⃣ more points in the bag for @PunjabKingsIPL! ? ?
A fantastic performance from the @mayankcricket-led unit as they beat #CSK by 5⃣4⃣ runs to seal their second win of the #TATAIPL 2022. ? ? #CSKvPBKS
Scorecard ▶️ https://t.co/ZgMGLamhfU pic.twitter.com/TU4lEoVG7D
— IndianPremierLeague (@IPL) April 3, 2022
గత సీజన్ విజేత చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో ఇంకా విజయాల ఖాతాను తెరవలేదు. రెండు మ్యాచ్‌లు ఆడిన చెన్నై టీం రెండింటిలోనూ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
ఈ సీజన్‌లో పంజాబ్ పటిష్టమైన ఆరంభాన్ని సాధించి, రెండో మ్యాచ్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో గెలవాలని కోరుకుంటోంది.
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు చిత్తుగా ఓడింది. 181 పరుగులను ఛేదించే క్రమంలో కేవలం 126 పరుగులకే అలౌటైంది. దీంతో 54 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. శివమ్ దూబె (57) మినహా మరెవరూ కాసేపైనా క్రీజులో నిలవలేకపోయారు. కాగా ఈ టోర్నీలో సీఎస్కేకు ఇది వరుసగా మూడో ఓటమి.
చెన్నై జట్టు 9 వికెట్ కోల్పోయింది. రాహుల్ చాహర్ బౌలింగ్‌లో ధోని (23) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆజట్టు స్కోరు 17.2 ఓవర్లలో 124/9 గా ఉంది.
మరో ఓటమికి చేరువలో ఉంది చెన్నై . 181 పరుగుల లక్ష్య ఛేదనలో ఆ జట్టు 107 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. క్రీజులో (12), క్రిస్ జోర్డాన్ (0) క్రీజులో ఉన్నారు.
ఆల్‌రౌండర్ డ్వైన్ బ్రావో మొదటి బంతికే డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో ఆ జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. కాగా బ్యాటింగ్‌లో అర్ధసెంచరీ చేసిన లివింగ్ స్టోన్ బౌలింగ్లోనూ రాణించి 2 వికెట్లు తీశాడు.
నిలకడగా ఆడుతున్న శివమ్ దూబె (57)ను లివింగ్ స్టోన్ ఔట్ చేశాడు. దీంతో 98 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది చెన్నై. ఆ జట్టు విజయానికి ఇంకా 31 బంతుల్లో 83 పరుగులు అవసరం.
శివవ్ దూబె 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్ లో 5 ఫోరర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. అతనికి తోడుగా ధోని (10) క్రీజులో ఉన్నాడు. కాగా 14 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే స్కోరు 90/5. ఆ జట్టు విజయానికి 36 బంతుల్లో 91 పరుగులు అవసరం.
సీఎస్కే స్కోరు 50 పరుగులు దాటింది. క్రీజులో శివమ్ దూబె (28), ధోని (5) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 11 ఓవర్లు ముగిసే సరికి 61/5. ఆ జట్టు విజయానికి ఇంకా 54 బంతుల్లో 120 పరుగులు అవసరం.
అంబటి రాయుడు (13) కూడా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఓడియన్ స్మిత్ బౌలింగ్ లో కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 7.3 ఓవర్లలో 36/5. దూబె (8), ధోని (1) క్రీజులో ఉన్నారు.
సీఎస్కే జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో కెప్టెన్ రవీంద్ర జడేజా డకౌటయ్యాడు. క్రీజులో శివమ్ దూబె (4), రాయుడు (8) క్రీజులో ఉన్నారు.
చెన్నై జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. స్టార్ అల్‌రౌండర్ మొయిన్ అలీ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 5 ఓవర్లు ముగిసే సరికి 22/3. క్రీజులో రాయుడు (7), జడేజా (0) ఉన్నారు.
సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో మెరుపు ఇన్నింగ్స్ లు ఆడిన రాబిన్ ఊతప్ప (13)ను వైభవ్ అరోరా ఔట్ చేశాడు. ప్రస్తుతం చెన్నై స్కోరు 3.2 ఓవర్లకు 20/2. క్రీజులో అంబటి రాయుడు (5), మొయిన్ అలీ (0) ఉన్నారు.
పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. లివింగ్ స్టోన్ (60) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధావన్ (33), జితేశ్ శర్మ (26) రాణించారు. చెన్నై బౌలర్లలో క్రిస్ జోర్డాన్ (23/2), ప్రిటోరియస్ (30/2) సత్తాచాటారు.
పంజాబ్ జట్టు 8 వ వికెట్ కోల్పోయింది. రాహుల్ చాహర్ (12) ప్రిటోరియస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కాగా 19 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోరు 176/8
క్రిస్‌జోర్డాన్ ఈ మ్యాచ్‌లో రెండో వికెట్ తీశాడు. ఓడియన్ స్మిత్ (3)ను ఔట్ చేసి పంజాబ్ జట్టును కష్టా్ల్లోకి నెట్టాడు. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 17.3 ఓవర్లలో 164/7.
పంజాబ్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతుంది. ఆదుకుంటాడనుకున్న షారుక్ (6) జోర్డాన్ బౌలింగ్‌లో ఔటవ్వడంతో 151 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో ఓడియన్ స్మిత్ (2), కగిసో రబాడ(1) క్రీజులో ఉన్నారు.
పంజాబ్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. ఆ జట్టు వికెట్ కీపర్ జితేశ్ శర్మ (26) ప్రిటోరియస్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 14.5 ఓవర్లలో 146/5.
వేగంగా పరుగులు సాధిస్తోన్న లివింగ్ స్టోన్ (60), ధావన్‌లు వెంటవెంటనే ఔటవ్వడంతో పంజాబ్ మళ్లీ కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఆజట్టు స్కోరు 11 ఓవర్లలో 115/. షారుక్ ఖాన్ (0), జితేశ్ శర్మ (1) క్రీజులో ఉన్నారు.
భారీ భాగస్వామ్యం (95 రన్స్) దిశగా సాగుతున్న లివింగ్ స్టోన్, ధావన్‌ల జోడిని విడదీసి చెన్నైకు బ్రేక్ ఇచ్చాడు సీనియర్ బౌలర్ డ్వేన్ బ్రేవో. ఇతని బౌలింగ్‌లో భారీషాట్‌కు యత్నించి రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు శిఖర్ (33).
ధాటిగా ఆడుతోన్న పంజాబ్ బ్యాటర్ లివింగ్‌స్టోన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో ఈ మార్క్‌ను చేరుకున్నాడు. మరోవైపు ధావన్ ( 23 బంతుల్లో 33) కూడా వేగంగా ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 10 ఓవర్లకు 109/3.
వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ను లివింగ్ స్టోన్ (48), ధావన్ (27) ఆదుకున్నాడు. అభేద్యమైన మూడో వికెట్‌కు కేవలం 46 బంతుల్లో 82 పరుగులు జోడించారు. ఇప్పుడు ఆ జట్టు స్కోరు 9 ఓవర్లు ముగిసే సరికి 96/2.
పంజాబ్ బ్యాటర్ లివింగ్ స్టోన్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో ఆ జట్టు 4.5 ఓవర్లలోనే యాభై పరుగులు పూర్తి చేసుకుంది. లివింగ్ స్టోన్ కేవలం 15 బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్స్‌లతో 38 పరుగులు చేశాడు. అతనికి తోడుగా శిఖర్ ధావన్ (3) పరుగులతో క్రీజులో ఉన్నాడు. 5 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోరు 57/2.
పంబాబ్‌కు డబుల్ షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న భానుక రాజపక్సే (9)ను ఎం.ఎస్.ధోని మెరుపు వేగంతో రనౌట్ చేశాడు. దీంతో ఆ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం పంజాబ్ స్కోరు 2 ఓవర్లు ముగిసే సరికి 17/2. ధావన్ (0), లివింగ్‌స్టోన్ (3) క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (4) ఇన్నింగ్స్ రెండో బంతికే వెనుదిరిగాడు. ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో ఊతప్పకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు.
కాగా ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు కొద్దిపాటి మార్పులతో బరిలోకి దిగాయి. చెన్నై జట్టులో తుషార్ పాండే స్థానంలో క్రిస్ జోర్డాన్ వచ్చాడు. పంజాబ్ జట్టు హర్‌ప్రీత్ బ్రార్ రాజ్ బావల స్థానంలో జితేష్ శర్మ, వైభవ్ అరోరాలకు చోటు కల్పించింది.
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు చెన్నై కెప్టెన్ రవీంద్ర జడేజా. మరికొన్ని నిమిషాల్లో పంజాబ్ బ్యాటింగ్ ప్రారంభం కానుంది.
IPL-2022లో చెన్నై సూపర్ కింగ్స్ నేడు పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో చెన్నైకి విజయం ఎంతో అవసరం. చెన్నై ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడగా రెండింటిలోనూ ఓడిపోయింది.
రెండు జట్ల గణాంకాలను పరిశీలిస్తే చెన్నైదే పైచేయిగా నిలిచింది. ఇరు జట్లు ఇప్పటి వరకు 26 మ్యాచ్‌ల్లో తలపడగా, అందులో చెన్నై 16 మ్యాచ్‌లు, పంజాబ్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.