CSK vs GT Live Score, IPL 2022 : లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన గుజరాత్‌.. 7 వికెట్ల తేడాతో భారీ విజయం..

|

May 15, 2022 | 7:24 PM

CSK vs GT Live Score, IPL 2022 : చెన్నై ఇచ్చిన 134 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్‌ టైటాన్స్‌ సునాయసంగా ఛేదించింది. ఇంకా 5 పరుగులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. వృద్దిమాన్‌ సాహా 57 బంతుల్లో 67 పరుగులు సాధించి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు..

CSK vs GT Live Score, IPL 2022 : లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన గుజరాత్‌.. 7 వికెట్ల తేడాతో భారీ విజయం..

Chennai Super Kings vs Gujarat Titans Live Score in telugu:గుజరాత్‌ టైటాన్స్‌ తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. చెన్నై ఇచ్చిన 134 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. చెన్నై ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ మొదటి నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్‌ వృద్దిమాన్‌ సాహా 57 బంతుల్లో 67* పరుగులు సాధించి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ తర్వాత శుభ్‌మన్‌ గిల్‌ (18), వేడ్‌ (20), డేవిడ్‌ మిల్లర్‌ (15) చేశారు. ఇక చెన్నై బౌలర్ల విషయానికొస్తే పతిరా 2, మెయిన్‌ అలీ ఒక వికెట్ తీశారు. దీంతో గుజరాత్‌ టీ20 సిరీస్‌లో పదో గెలుపును సొంతం చేసుకుంది.

ఇక అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన చెన్నై బ్యాటర్లు తడబడ్డారు. గుజరాత్‌ బౌలర్లు దాటికి తక్కువ స్కోరుకే పరిమితం అయ్యారు. చెన్నై బ్యాటర్లలో రుతురాజ్‌ గైక్వాడ్‌ చేసిన 53 పరుగులు మాత్రమే అత్యధికం కావడం గమనార్హం. మొదటి నుంచి గుజరాత్‌ బౌలర్లు చెన్నై బ్యాటర్లను కట్టిడి చేశారు. దీంతో క్రీజులోకి వచ్చిన ప్లేయర్‌ వచ్చినట్లు పెవిలియన్‌ బాట పట్టారు. రుతురాజ్‌ తర్వాత జగదీశన్ (39*), మొయిన్ అలీ (21) ఫర్వాలేదనిపించారు. డేవన్ కాన్వే (5), శివమ్‌ దూబే (0), ఎంఎస్ ధోనీ (7) విఫలమయ్యారు.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 15 May 2022 07:07 PM (IST)

    లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన గుజరాత్‌..

    చెన్నై ఇచ్చిన 134 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్‌ టైటాన్స్‌ సునాయసంగా ఛేదించింది. ఇంకా 5 పరుగులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. వృద్దిమాన్‌ సాహా 57 బంతుల్లో 67 పరుగులు సాధించి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో గుజరాత్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని, పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని పదిలం చేసుకుంది.

  • 15 May 2022 06:40 PM (IST)

    హాఫ్‌ సెంచరీ..

    వృద్దిమాన్‌ సాహా హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 42 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో సాహా 50 పరుగులు చేశాడు. గుజరాత్‌ విజయానికి ఇంకా బంతుల్లో పరుగులు చేయాల్సి ఉంది.

  • 15 May 2022 06:39 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌..

    గుజరాత్‌ టైటాన్స్‌ మూడో వికెట్ కోల్పోయింది. మతీష పతిరన బౌలింగ్‌లో శివమ్‌ దూబేకు క్యాచ్‌ ఇచ్చిన హార్ధిక్‌ పాండ్యా పెవిలియన్‌ బాట పట్టారు.

  • 15 May 2022 06:32 PM (IST)

    రెండో వికెట్ డౌన్‌..

    గుజరాత్‌ టైటాన్స్‌ రెండో వికెట్ కోల్పోయింది. 20 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద మాథ్యూ వేడ్ మొయిన్‌ అలీ బౌలింగ్‌లో శివమ్‌ దూబే బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు.

  • 15 May 2022 06:26 PM (IST)

    10 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌ ఎంతంటే..

    గుజరాత్‌ బ్యాటర్లు దూకుడు పెంచారు. చెన్నై ఇచ్చిన 134 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. 10 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్‌ ఒక వికెట్ నష్టానికి 83 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 15 May 2022 06:11 PM (IST)

    తొలి వికెట్ డౌన్‌..

    గుజరాత్‌ టైటాన్స్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. మతీష పతిరన బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ ఎల్‌బీడబ్ల్యూ రూపంలో అవుట్‌ అయ్యాడు. మతీష 17 బంతుల్లో 18 పరుగులు సాధించాడు.

  • 15 May 2022 06:06 PM (IST)

    క్రమంగా పెరుగుతోన్న స్కోర్ బోర్డ్‌..

    చెన్నై ఇచ్చిన 134 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన గుజరాత్ బౌలర్లు దాటిగా ఆడుతున్నారు. సాహా, గిల్‌ ఇద్దరూ ఆచితూచి ఆడుతుండడంతో జట్టు స్కోర్‌ పెరుగుతోంది. ఈ క్రమంలోనే 7 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్‌ స్కోర్‌ 59 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో గిల్‌ (16), వృద్దిమాన్‌ సాహా (40) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.

  • 15 May 2022 05:24 PM (IST)

    తక్కువ స్కోరుకే పరిమితమైన చెన్నై..

    గుజరాత్‌ బౌలర్ల దాటికి చెన్నై బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. టాస్‌ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 133 పరుగులు మాత్రమే చేసింది. గుజరాత్‌ బౌలర్లంతా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో వచ్చిన బ్యాట్స్‌మెన్‌ వచ్చినట్లు పెవిలియన్ బాట పట్టారు. చెన్నై బ్యాటర్లలో రుతురాజ్‌ గైక్వాడ్‌ (53), జగదీశన్‌ (39) పరుగులతో పర్వాలేదనిపించిన మిగతా వారంతా వెంట వెంటనే పెవిలియన్‌ బాట పట్టారు.

  • 15 May 2022 05:21 PM (IST)

    ధోనీ అవుట్‌..

    చివరి క్షణాల్లో ధోని మ్యాజిక్‌తో స్కోర్‌ బోర్డ్‌ పెరుగుతుందన్న ఆశలు నిరాశలు అయ్యాయి. కేవలం 7 పరుగులు మాత్రమే చేసిన ధోని షమీ బౌలింగ్‌లో యశ్‌ దయాల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

  • 15 May 2022 05:07 PM (IST)

    బ్యాక్‌ టు బ్యాక్‌ వికెట్స్‌ కోల్పోతున్న చెన్నై..

    చెన్నై నాలుగో వికెట్ కోల్పోయింది. రుతురాజ్‌ అవుటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన శివమ్‌ దూబే డకౌటయ్యాడు. జోసఫ్‌ బౌలింగ్‌లో సాహాకు క్యాచ్‌ ఇచ్చి దూబే వెనుదిరిగాడు.

  • 15 May 2022 05:00 PM (IST)

    హాఫ్‌ సెంచరీ చేసిన వెంటనే అవుట్‌.

    జట్టు స్కోరును పెంచుతున్నాడని అనుకుంటున్న సమయంలోనే రుతురాజ్‌ అవుట్‌ అయ్యాడు. 49 బంతుల్లో 53 పరగులు చేసిన రుతురాజ్‌ అవుట్‌ అయ్యాడు.

  • 15 May 2022 04:52 PM (IST)

    హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న రుతురాజ్‌..

    జట్టు స్కోర్ పెంచే బాధ్యతను తీసుకున్న రుతురాజ్‌ హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 44 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 పరుగులు చేశాడు. దీంతో జట్టు స్కోర్‌ కూడా ప్రస్తుతం 100 పరుగుల మార్క్‌ను దాటేసింది.

  • 15 May 2022 04:28 PM (IST)

    10 ఓవర్లకు చెన్నై స్కోర్‌ ఎంతంటే..

    10 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై సూపర్ కింగ్స్‌ 2 వికెట్ల నష్టానికి 73 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో జగదీశన్‌ (5), రుతురాజ్‌ (38) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.

  • 15 May 2022 04:23 PM (IST)

    రెండో వికెట్‌ డౌన్‌..

    మంచి పాట్నర్‌ షిప్‌ అందుతోంది అనుకుంటోన్న సమయంలోనే చెన్నైకి ఎదురుదెబ్బ తగిలింది. మొయిన్‌ అలీ రూపంలో రెండో వికెట్‌ కోల్పోయింది. 21 పరుగుల వద్ద సాయి కిశోర్‌ బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రుతురాజ్‌, మొయిన్‌ అలీల 57 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్‌ పడింది.

  • 15 May 2022 03:58 PM (IST)

    నెమ్మదించిన చెన్నై స్కోర్‌ బోర్డ్‌..

    చెన్నై సూపర్ కింగ్స్‌ స్కోర్ బోర్డ్ నెమ్మదించింది. గుజరాత్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండడంతో స్కోర్ బోర్డ్‌ నెమ్మదించింది. 5 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై ఒక వికెట్ కోల్పోయి 30 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 15 May 2022 03:45 PM (IST)

    తొలి వికెట్‌ డౌన్‌..

    చెన్నై సూపర్ కింగ్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. డెవాన్‌ కాన్వే షమీ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

  • 15 May 2022 03:26 PM (IST)

    తుది జట్లు..

    సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, శివం దూబే, ఎన్‌ జగదీషన్‌, ఎంఎస్ ధోని(కెప్టెన్), మిచెల్‌ సాండ్నర్‌, ప్రశాంత్‌ సోలంకి, సిమ్రన్‌జిత్ సింగ్, మతీష పతిరన, ముఖేశ్ చౌదరి

    గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్దిమాన్ సాహా(కీపర్), మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, సాయి కిషోర్, యశ్ దయాల్

  • 15 May 2022 03:19 PM (IST)

    టాస్‌ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌..

    టాస్‌ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌ తొలుత బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపింది. వాంఖడే హై స్కో్రింగ్‌కు వేదికగా మారడం, డ్యూ ప్రభావం ఉండకోపవడం కారణంతో చెన్నై తొలుత బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపింది.

Follow us on