కంగారూలకు షాక్.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు స్టాయినిస్ దూరం!

| Edited By: Pardhasaradhi Peri

Jun 11, 2019 | 9:40 PM

ప్రపంచకప్‌లో ఆటగాళ్ల గాయాల బెడద.. ఆయా జట్లను తీవ్ర ఇబ్బంది పెడుతోంది. టోర్నీలో విజయాల సంగతి పక్కన పెడితే.. ఒకవైపు గాయాలు.. మరోవైపు వరుణుడు అడ్డంకి అన్ని జట్లకు సమస్యగా మారాయి. ఇది ఇలా ఉంటే డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆల్ రౌండర్ మార్కస్ స్టాయినీస్ పక్కటెముకలు నొప్పితో బుధవారం పాకిస్థాన్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇక అతని స్థానంలో మిచెల్ మార్ష్ జట్టులోకి రానున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా […]

కంగారూలకు షాక్.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు స్టాయినిస్ దూరం!
Follow us on

ప్రపంచకప్‌లో ఆటగాళ్ల గాయాల బెడద.. ఆయా జట్లను తీవ్ర ఇబ్బంది పెడుతోంది. టోర్నీలో విజయాల సంగతి పక్కన పెడితే.. ఒకవైపు గాయాలు.. మరోవైపు వరుణుడు అడ్డంకి అన్ని జట్లకు సమస్యగా మారాయి. ఇది ఇలా ఉంటే డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆల్ రౌండర్ మార్కస్ స్టాయినీస్ పక్కటెముకలు నొప్పితో బుధవారం పాకిస్థాన్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇక అతని స్థానంలో మిచెల్ మార్ష్ జట్టులోకి రానున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. అయితే అధికారికంగా మార్ష్‌ను ఎంపిక చేసిన విషయాన్ని మాత్రం ఆసీస్ ఐసీసీకి వెల్లడించలేదు. ప్రస్తుతానికైతే స్టాయినీస్ జట్టుతోనే ఉన్నాడు. ఒకవేళ గాయం నుంచి అతడు కోలుకుంటే మిగతా మ్యాచ్‌ల్లో అతన్ని కొనసాగించనున్నారు.

ఇది ఇలా ఉంటే ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 36 పరుగుల తేడాతో భారత్ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. స్టాయినిస్.. ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లలో 62 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు.