CPL 2021: 9 భారీ సిక్సర్లతో ఐపీఎల్ ప్రత్యర్థులను హెచ్చరించిన రాజస్థాన్ ప్లేయర్.. కీలక ప్లేయర్ల లోటు తీర్చేందుకు సిద్ధమైన కివీస్ కీపర్

|

Sep 13, 2021 | 10:02 AM

Rajasthan Royals: ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ టీం తీవ్ర ఇబ్బందులో పడింది. ముగ్గురు కీలక విదేశీ ఆటగాళ్లను కోల్పోయి, పీకల్లోతూ కష్టాల్లో పడింది.

CPL 2021: 9 భారీ సిక్సర్లతో ఐపీఎల్ ప్రత్యర్థులను హెచ్చరించిన రాజస్థాన్ ప్లేయర్.. కీలక ప్లేయర్ల లోటు తీర్చేందుకు సిద్ధమైన కివీస్ కీపర్
Rajasthan Royals Player Glenn Phillips
Follow us on

IPL 2021: ఐపీఎల్ 2021 రెండో దశ మరో 6 రోజుల్లో ప్రారంభం కానుంది. దీని కోసం అన్ని జట్లు యూఏఈకి చేరుకున్నాయి. మొత్తం 8 జట్లు టైటిల్ గెలుచుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మాత్రం కీలక ప్లేయర్లు దూరం అయ్యారు. దీంతో ఈ సీజన్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి. ఇంగ్లండ్ ప్లేయర్లు దూరం కావడంతో ఎక్కువ రాజస్థాన్ జట్టే ఇబ్బంది పడుతోంది. అయితే కొంతమంది కొత్త ఆటగాళ్లను కూడా జోడించింది. వీరిలో ఓ బ్యాట్స్‌మెన్ వారి కొరత తీర్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.

రాజస్థాన్ రాయల్స్ ముగ్గురు అగ్ర విదేశీ ఆటగాళ్లు – బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, జోస్ బట్లర్ ఆరోగ్యం, కుటుంబ కారణాల వల్ల ఈ సీజన్‌కు దూరంగా ఉన్నారు. మొదటి భాగం ప్రారంభంలో స్టోక్స్, ఆర్చర్ ఔట్ కాగా, బట్లర్ మొదటి భాగంలో సెంచరీతో సహా కొన్ని ముఖ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. యూఏఈలో మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. ఎందుకంటే బట్లర్ ఇటీవల మరోసారి తండ్రి అయ్యాడు. కుటుంబంతో గడపాలని కోరుకుంటుండడంతో దుబాయ్‌లో అతని ఆట కనిపించదు. ఇంగ్లీష్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ స్థానంలో న్యూజిలాండ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ గ్లెన్ ఫిలిప్స్‌ రాజస్థాన్ రాయల్స్‌తో చేరాడు.

సీపీఎల్‌లో ఫిలిప్స్ సిక్సర్ల వర్షం
24 ఏళ్ల ఫిలిప్స్ ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. విభిన్న టీ 20 టోర్నమెంట్‌లలో తన బ్యాట్‌తో బౌలర్లను దెబ్బతీశాడు. రాజస్థాన్ రాయల్స్, దాని అభిమానుల ఉత్సాహం రెట్టింపు అయ్యేలా చేశాడు. సెప్టెంబర్ 12న ఆదివారం నాడు కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఓ తుఫాన్ లాంటి ఇన్నింగ్స్ ఆడాడు. సీపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ గ్రూప్ జట్టు సభ్యుడైన బార్బడోస్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఫిలిప్స్ సూపర్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు.

సీజన్ చివరి మ్యాచ్‌లో, ఫిలిప్స్ సెయింట్ లూసియా కింగ్స్‌పై కేవలం 39 బంతుల్లో 80 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు నడిపించాడు. ఫిలిప్స్ ఇన్నింగ్స్‌లో 9 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి.

కైల్ మేయర్స్ ఆల్ రౌండ్ గేమ్
ఫిలిప్స్‌తో పాటు, వెస్టిండీస్‌కు చెందిన కైల్ మేయర్స్ కూడా ఈ మ్యాచ్‌లో తన సత్తా చాటాడు. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ బౌలింగ్‌లో అద్భుతాలు చేశాడు. ముగ్గురు కింగ్స్ బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చి తన సత్తా చాటాడు. దీని తర్వాత మేయర్స్ బ్యాట్ కూడా కింగ్స్ బౌలర్లను తీవ్రంగా దెబ్బతీసింది. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్ కేవలం 62 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. దీంతో రాయల్స్ 8 వికెట్లతో విజయం సాధించింది.

Also Read: ICC T20 World Cup 2021: ఐసీసీ ఈవెంట్లలో ధోనీ-శాస్త్రి-విరాట్ త్రయం విఫలం.. 8 ఏళ్లుగా భారత్‌కు అందని ద్రాక్షగానే ఐసీసీ టైటిల్..!

Neeraj Chopra: మమ్మల్ని చూసి ఎగతాళి చేశారు.. వ్యంగ్యంగా మాట్లాడారు.. కేబీసీ 13లో ఒలింపిక్ పతక విజేతల భావోద్వేగం.. ఈ షో ఎప్పుడంటే?

IPL 2021: శుభవార్త చెప్పిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్.. భార్యతో కలిసి సీఎస్‌కే జెర్సీలో సందడి..!